Telangana: పీయూష్‌ గోయల్‌ను కేటీఆర్ కలిసింది అందుకే.. సంచలన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి..

తెలంగాణలో సునామీ రాబోతుంది.. ఈ సునామీలో బీజేపీ , బీఆరెస్ కొట్టుకుపోవడం ఖాయం అన్నారు రేవంత్ రెడ్డి. ‘పదేళ్లుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ, బీఆరెస్ ప్రజలకు ద్రోహం చేశాయి. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో పాటు మరో ముఖ్యమైన గ్యారంటీని ఇస్తున్నాం. ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించే గ్యారంటీని కాంగ్రెస్ ఇస్తోంది.’ అని అన్నారు.

New Update
Telangana: పీయూష్‌ గోయల్‌ను కేటీఆర్ కలిసింది అందుకే.. సంచలన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి..

TPCC Chief Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ‘తెలంగాణలో సునామీ రాబోతుంది.. ఈ సునామీలో బీజేపీ , బీఆరెస్ కొట్టుకుపోవడం ఖాయం. పదేళ్లుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ, బీఆరెస్ ప్రజలకు ద్రోహం చేశాయి. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో పాటు మరో ముఖ్యమైన గ్యారంటీని ఇస్తున్నాం. ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించే గ్యారంటీని కాంగ్రెస్ ఇస్తోంది.’ అని అన్నారు. తెలంగాణలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం అని చెప్పారు.

మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు యధావిధిగా..

‘‘స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్నాయి. అందుకే బీజేపీ, బీఆరెస్ కుట్రలు చేస్తున్నాయి. రాష్ట్ర డీజీపీ, స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు, వేణుగోపాల్ రావు, నర్సింగ్ రావు, భుజంగరావు అంతా ఒక ప్రయివేటు సైన్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో చాలా మంది రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన అధికారులను ఎన్నికల కోడ్ రాగానే ఎన్నికల అధికారులు వారిని తొలగించాలి. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు ఒక ప్రయివేటు సైన్యాధిపతిగా మారారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నవారిని ప్రత్యక్షంగా బెదిరిస్తున్నారు.’ అని ఆరోపించారు.

ఇదికూడా చదవండి: Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడి తెరంగేట్రంపై రేణు దేశాయ్ ఎమన్నారంటే..?

‘స్టీఫెన్ రవీంద్రపై నేను సూటిగా ఆరోపణలు చేస్తున్నా. మైనారిటీలు బీఆరెస్‌కు ఓటు వేయాలని వారిని బెదిరిస్తున్నారు. ఈ అధికారులంతా ఎన్నికల కోసం బీఆర్ఎస్ అభ్యర్థుల డబ్బులను రవాణా చేస్తున్నారు. అరవింద్ కుమార్, జయేష్ రంజన్, సోమేశ్ కుమార్.. బీఆర్‌ఎస్‌కు చందాలు ఇవ్వాలని వ్యాపారస్థులపై ఒత్తిడి తెస్తున్నారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారికి విజ్ఞప్తి చేస్తున్నా. రిటైర్ అయిన పోలీసు అధికారులను వెంటనే తొలగించాలి. ఆర్ధిక శాఖ కార్యదర్శి రాంకృష్ణారావు నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా అరవింద్ కుమార్ భూ వినియోగ మార్పిడి చేపట్టారు. ఇవన్నీ చర్యలు తీసుకోవాల్సిన తప్పులే. ఎన్నికల అధికారి వీళ్లను వదిలేసి కొద్ది మంది అధికారులపైనే చర్యలు తీసుకున్నారు.’

‘కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్న 75 మంది వివరాలను కేటీఆర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు అందించారు. వారి ఫోన్ లపై నిఘా పెట్టి బీఆర్‌ఎస్, బీజేపీ సమన్వయంతో ముందుకు వెళుతోంది. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘనే. ఈ అధికారులందరిపై కాంగ్రెస్ రాతపూర్వకంగా పిర్యాదు చేస్తుంది. ఎన్నికల అధికారులు స్పందించకపోతే న్యాయస్థానం తలుపు తడతాం. అన్ని విభాగాల్లో రిటైర్ అయిన అధికారులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం.’

ఇదికూడా చదవండి: భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్…ఆసుపత్రులలో బెడ్స్ బుకింగ్

‘కాంగ్రెస్ విధి విధానాలు కేటీఆర్ కు తెలియవు. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ లో ఒక విధానం ఉంది. రేవంత్ రెడ్డి ఒక్కడి నిర్ణయంతో టికెట్ల ప్రకటన జరగదు. టికెట్ల కేటాయింపులో సీఈసీ నిర్ణయమే ఫైనల్. ప్రజలకు ముఖం చూపించలేకే కాంగ్రెస్ పై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి చిల్లర మల్లర ఆరోపణలను పట్టించుకునే పరిస్థితిలో మేం లేము.’ అని సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి.

Advertisment
తాజా కథనాలు