/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-22-jpg.webp)
Telangana Elections Effect: తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్ హైదరాబాద్ మెట్రోపై (Hyderabad Metro) తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అసెంబ్లీ ఎలక్షన్స్ నేపథ్యంలో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరవాసులంతా తమ సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. హైదరాబాద్ కూడా దాదాపు సగానికిపైగా ఖాళీ అయింది. అయితే ప్రతిరోజు ఊపిరాడని జనాలతో పరుగులు తీసే మెట్రో రైళ్లు బోసిపోయాయి. బోగీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
#METROHYDERABADpic.twitter.com/F8ByNjHlN9
— Sai vineeth(Journalist🇮🇳) (@SmRtysai) November 30, 2023
Also read : పోలింగ్ బూత్‌లో విషాదం.. లైన్ లోనే కుప్పకూలిన ఓటర్లు
ఇదిలావుంటే.. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ లకు భారీగా ప్రజలు తరలి వెళ్తుండగా అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇదే రోజు ఉదయం అధికశాతం ప్రయాణికులు తమ గ్రామాలకు బయలుదేరగా బస్సులు కిక్కిరిసిపోయాయి. చాలామంది బస్సు పైకి ఎక్కి, ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. జేబిఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్ లు నిండిపోయాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓటు వెయ్యటానికి సొంత గ్రామాలకు వెళుతూ ప్రయాణాలు చేస్తున్న వారికి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. కొంతమంది ఆర్టీసీ యాజమాన్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాయకుల మీటింగ్ లకు బస్సులు పంపించే ఆర్టీసీ ఆధికారులు ప్రజలకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Follow Us