CM KCR: కాంగ్రెస్ అధికారంలోకి రాదు.. భట్టి సీఎం కాడు.. కేసీఆర్ జోస్యం! ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా దాటవు అని అన్నారు సీఎం కేసీఆర్. ఈరోజు మధిరలో పర్యటించిన కేసీఆర్.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కాడు అని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 21 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మధిర నియోజకవర్గంలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. అక్కడ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. మధిర కాంగ్రెస్ అభ్యర్థి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని అన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వద్దు రా బాబు అన్న వినకుండా తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏపీలో కలిపిందని అన్నారు. తెలంగాణ సాధనం కోసం అనేక సంవత్సరాలు పోరాటం చేశాం అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా.. బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. మీ ఓటు మీ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. అమెరికాలో ఎన్నికల కోసం ప్రచార సభలు జరగవని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఓటు వేసే విధానం రావాలని తెలిపారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణతి రాలేదని అన్నారు. ALSO READ: కొవిడ్ వ్యాక్సిన్ వల్ల మరణాలు..ఐసీఎంఆర్ ఏమని చెప్పిందంటే! ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు సీఎం కేసీఆర్. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ తయారైందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తే విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. మధిర నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. భట్టి విక్రమార్కకు ఓటు వేస్తే నష్టమే అని హెచ్చరించారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని అన్నారు. దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంకు గానే వాడుకుందని.. వారి అభివృద్ధి కోసం ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని విమర్శించారు. భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అయ్యేది లేదని ఖరాఖండిగా చెప్పారు సీఎం కేసీఆర్. ALSO READ: చంద్రబాబుపై బెయిల్‌పై సుప్రీంకోర్టుకు సీఐడీ.. #bhatti-vikramarka #cm-kcr #telangana-elections-2023 #telugu-latest-news #trending-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి