TS Polls: కేసీఆర్ అందుకే అలా చెబుతున్నాడు.. భట్టి కీలక వ్యాఖ్యలు! సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. తెలంగాణలో 70పైన కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 21 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ (CM KCR) పై ఫైర్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka). ఈరోజు మధిర నియోజకవర్గంలో పర్యటించిన కేసీఆర్ భట్టి విక్రమార్కపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ కు (Congress) 20 సీట్లు కూడా రావని.. భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కాడని సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని... తాము ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభల్లో కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని అన్నారు. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ALSO READ: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన కీలక నేత! ఇల్లు లేని వారికి ఇళ్లివ్వడం ఇందిరమ్మ రాజ్యమని భట్టి అన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్‌లిచ్చింది ఇందిరమ్మ రాజ్యంలోనే అని తెలిపారు. అట్టడుగు వారిని పైకి తీసుకురావడమే ఇందిరమ్మ రాజ్యం అని పేర్కొన్నారు. పరిశ్రమలు, డ్యామ్‌లు నిర్మించడమే ఇందిరమ్మ రాజ్యమని అన్నారు. కేసీఆర్ తెలంగాణలో మళ్లీ ఫ్యూడల్ వ్యవస్థ తీసుకువచ్చారని మండిపడ్డారు. కేసీఆర్ అనే బండరాయిని రత్నం అనుకొని తెలంగాణ ప్రజలు పదేళ్లు నెత్తిన పెట్టుకున్నారని అన్నారు. 70పైన కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు అయ్యాక సీఎంగా ఉండి కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారని అన్నారు. ALSO READ: BREAKING: బర్రెలక్కపై దాడి.. టెన్షన్ టెన్షన్! #cm-kcr #telugu-latest-news #breaking-news #telangana-election-2023 #clp-leader-bhatti-vikramarka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి