Revanth Reddy: ఓటుకు రూ. 10 వేలు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే భూములను ఖబ్జా చేస్తారని ఆరోపించారు. అన్ని రంగాల్లో కేసీఆర్ విఫలం అయ్యారని అన్నారు.

New Update
Revanth Reddy: ఓటుకు రూ. 10 వేలు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Telangana Elections 2023: తెలంగాణలో మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్నీ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రచారంలో భాగంగా ఈరోజు కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గంలో పర్యటించారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఈ నేపథ్యంలో కామారెడ్డిలో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ (CM KCR)పై నిప్పులు చెరిగారు.

ALSO READ: బీడీ కార్మికులకు రూ.5,000 పెన్షన్.. 

కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు కామారెడ్డి భవిష్యత్‌ను మార్చే ఎన్నికలు అని పేర్కొన్నారు. పుట్టకూటి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లే కార్మికులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారు. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ నిధి హామీ ఇచ్చి ఏర్పాటు చేయలేదని ఫైర్ అయ్యారు. కామారెడ్డిలో ఉన్న రైతుల భూములను మింగేందుకే కేసీఆర్‌ కామారెడ్డికి వచ్చారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటుకు రూ. 10 వేలు ఇచ్చి గెలవాలని కేసీఆర్‌ చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ గెలిస్తే కామారెడ్డిలో వ్యవసాయం చేసుకునేందుకు భూములు ఉండవని అన్నారు.

ALSO READ: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా మొదటి తారీఖు రూ.2500 ఖాతాలో వేస్తామని అన్నారు. రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు