సామ రామ్ మోహన్ రెడ్డికి కీలక పదవి అప్పగించిన రేవంత్
టీపీసీసీ మీడియా&కమ్యూనికేషన్స్ చైర్మన్ గా సామ రామ్ మోహన్ రెడ్డిని టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియించారు. ఈ మేరకు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
టీపీసీసీ మీడియా&కమ్యూనికేషన్స్ చైర్మన్ గా సామ రామ్ మోహన్ రెడ్డిని టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియించారు. ఈ మేరకు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా విజయం సాధించిన తన పేరును సీఎం పదవికి కాంగ్రెస్ హైకమాండ్ తప్పకుండా పరిశీలిస్తుందని ఆశిస్తున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతోందన్నారు.
బీజేపీ విజయాలకు తామెలా కారణమవుతామంటూ కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టుకే ఆరెస్సెస్ లో ఉందని, గాంధీ భవన్ రిమోట్ మోహన్ భగవత్ చేతిలో ఉందని విమర్శించారు.
ఓటుకు నోటు కేసులో లంచం ఇస్తూ అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ రోజు కొడంగల్ లో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల మీటింగ్ లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్ రెడ్డికి ఓటు వేస్తే సేవ చేసే నరేందర్ రెడ్డిని కోల్పోతారని అన్నారు.
ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే భూములను ఖబ్జా చేస్తారని ఆరోపించారు. అన్ని రంగాల్లో కేసీఆర్ విఫలం అయ్యారని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ఎటిఎంలా వాడుకుంటుందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేసి.. దాని స్థానంలో కొత్త యాప్ ను ప్రవేశపెడుతామని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూడో లిస్టుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి స్థానాలపై నేతల మధ్య పోరు తారాస్థాయికి చేరడంతో కాంగ్రెస్ అధిష్టానం ఎటు తేల్చలేకపోతుంది. ఈ స్థానాలపై మరో రెండ్రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇవ్వనుంది.
కేటీఆర్- రేవంత్రెడ్డి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఒక్కటే నని. త్వరలో సీఎం కేసీఆర్ ఖేల్ ఖతం..బీఆర్ఎస్ దుఖాన్ బంద్ అని రేవంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ కు బిగ్ షాక్ . ఆ పార్టీ సీనియర్ నేత పీసీసీ ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు తన పదవికి, పార్టీ సభ్యత్వానికి శనివారం ఉదయం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆయన పంపారు. ఆయన త్వరలోనే అధికారపార్టీలోకి చేరే అవకాశాలున్నట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు సీనియర్ నేత జగదీశ్వర్ రావ్ కూడా తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ పరిణామాలతో కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిప్పలు తప్పేట్టుగా లేవు...