BREAKING: బండి సంజయ్‌పై కోడిగుడ్లతో దాడి

ప్రజాహిత యాత్రలో బండి సంజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. భీమదేవరపల్లి మండలం వంగరలో యాత్ర కొనసాగుతున్న సమయంలో బండి సంజయ్ కారుపై కోడిగుడ్లతో దాడికి దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. మంత్రి పొన్నం డ్రామాలాపకపోతే హుస్నాబాద్‌లో తిరగనివ్వబోమని బండి హెచ్చరించారు.

New Update
BREAKING: బండి సంజయ్‌పై కోడిగుడ్లతో దాడి

Bandi Sanjay : బండి సంజయ్‌ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీమదేవరపల్లి మండలం వంగరలో సంజయ్ యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో బండి సంజయ్‌ కారుపై కోడిగుడ్లతో దాడికి(Attack With Eggs) ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. పోలీసులపై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లతో దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని ఫైర్ అయ్యారు. మీ భద్రత నాకు అవసరం లేదు వెళ్లిపోండి అంటూ మండిపడ్డారు. మేం తలుచుకుంటే కాంగ్రెస్‌ నేతలు గ్రామాల్లో తిరగలేరని వార్నింగ్‌ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ డ్రామాలాపకపోతే హుస్నాబాద్ లో తిరగనివ్వబోమని హెచ్చరించారు.

ఓ వెదవ అంటూ మంత్రి పొన్నం ఆగ్రహం..

కరీంనగర్(Karimnagar) ఎంపీ, బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay) ను కాంగ్రెస్(Congress) మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పొట్టు పొట్టు తిట్టారు. ఓ వెధవ, ఓట్ల బిచ్చగాడ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా హుస్నాబాద్ నియోజక వర్గానికి వెళ్లిన బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం, పొన్నం ప్రభాకర్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. రాముని గురించి కూడా ప్రస్తావించారు. దీంతో వేములవాడ నియోజకవర్గంలో నాంపల్లి గుట్టమీద ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మాట్లాడిన మంత్రి బండిపై మండిపడ్డారు.

Also Read : చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ఓట్ల బిచ్చగానివి..

ఈ మేరకు శివరాత్రి ఉత్సవాలు, నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి సంబంధించి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ తల్లి పేరు తీసింది సంజయ్.. నేనెప్పుడూ కూడా తీయలేదని అన్నారు. కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితోపాటు బీజేపీ ప్రభుత్వం రాముని పేరుతో ఓట్లు అడుక్కుంటున్నారనరి, ఓట్ల బిచ్చగానిగా మారారని అన్నారు. అలాగే ‘ఓ వెధవ తల్లి పేరు నువ్వు తీసావా? నేను తీసానా?అంటూ మండిపడ్డారు. బతికున్న తన తల్లిని పట్టుకుని ఆత్మ ఘోచిస్తుందంటవా అంటూ బండిపై ఫైర్ అయ్యారు.

Advertisment
తాజా కథనాలు