/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/REVANTH-REDDY-6-jpg.webp)
Telangana Elections 2023: తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వమే టార్గెట్ గా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారంలో సీఎం కేసీఆర్ పై విమర్శల దాడి చేస్తున్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయితే రాష్ట్రాన్ని తాకట్టు పెడుతాడని ఆరోపించారు. మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బయపడుతున్నాయని అన్నారు.
ALSO READ: నేడే వరల్డ్ కప్ ఫైనల్స్… ఆల్ ది బెస్ట్ టీం ఇండియా!
ఈరోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2018 తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయని అన్నారు. ఈ ఎన్నికల్లో 110 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతు అవుతాయని జోస్యం చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ అభ్యర్థినే సీఎం చేస్తామని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న బీజేపీ నేతలు చెబుతున్నారని.. డిపాజిట్లు రాని పార్టీ.. రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తుంది? అని ప్రశ్నించారు.
ALSO READ: బీఆర్ఎస్‌లోకి బాబు మోహన్ కొడుకు ఉదయ్
బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే.. ఒకరు మాత్రమే ఓబీసీ సీఎం ఉన్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీసీ గణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా బీజేపీ పట్టించుకోలేదని మండిపడ్డారు. బీసీ గణన చేయలేని పార్టీ బీసీ సీఎంను ఎలా చేస్తుంది? అని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు అయ్యాక ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇస్తున్నారని.. ఎన్నికలు అయ్యాక ఇచ్చిన హామీని బీజేపీ నేతలు మర్చిపోతారని అన్నారు. బీజేపీ చెప్పే మాటలు దళితులు ఎవరూ నమ్మరు అని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను ఇచ్చిన తొలి పార్టీ కాంగ్రెస్ అని రేవంత్ పేర్కొన్నారు. చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడిగే స్థితిలో కేసీఆర్ లేరని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.