Telangana Elections 2023: నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ నాయకులు.. పలు చోట్ల ఎన్నికల ప్రచారం..

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహించేందుకు రాష్ట్రానికి బీజేపీ జాతీయ నాయకులు వస్తున్నారు. అసోం సీఎం హిమంత విశ్వ శర్మ, ఎంపీ తేజస్వి సూర్య, ఎంపీ రవిషన్ సహా పలువురు నేతలు వస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

New Update
Haryana BJP: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్

Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ఎన్నికల ప్రచారానికి కూడా చాలా తక్కువ సమయమే ఉంది. దాంతో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. బుధవారం రాష్ట్రంలో పలువురు బీజేపీ జాతీయ నేతలు(BJP) ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అసో సీఎం హిమంత్ బిశ్వ శర్మ తెలంగాణ(Telangana)కు వస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం 6 గంటలకు చార్మినార్ బెలా క్రాస్ రోడ్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు హిమంత విశ్వ శర్మ. 7 గంటలకు ముషీరాబాద్ చౌరస్తాలో హిమంత విశ్వ శర్మ సభ ఉంటుంది. మరోనేత బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య హైదరాబాద్‌లో పలు చోట్ల ప్రచారం నిర్వహించనున్నారు. యూపీ ఎంపీ, నటుడు రవి కిషన్ పఠాన్ చెరువు, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. అలాగు కేంద్ర మంత్రి అర్జున్ ముండా.. వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇక బీజేపీతో పొత్తు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరంగల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ సమీక్ష..

ఇదిలాఉంటే.. తెలంగాణలో పోలింగ్ ఏర్పాట్లపై బుధవారం నాడు ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు ఈసీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, ఎఫ్.ఐ.ఆర్‌లు, ఓటరు సమాచార పత్రాలు, ఓటరు కార్డుల పంపిణీ స్థితిగతులపై ఆరా తీసే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర అంశాలపై కూడా చర్చించనుంది ఈసీ.

Also Read:

కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్..

కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు..

Advertisment
తాజా కథనాలు