Revanth Reddy: తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి.. కేసీఆర్ పై రేవంత్ ఫైర్!

నర్సాపూర్ కాంగ్రెస్ విజయభేరి సభలో సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణను బెల్టు షాపుల్లో మొదటి స్థానంలో నిలిపిన ఘనుడు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు.

New Update
Telangana Elections 2023: ఫామ్‌ హౌస్ చుట్టూ రిజర్వాయర్లు కట్టుకుని నల్గొండకు నీళ్లు ఎందుకియ్యలే కేసీఆర్: రేవంత్

Telangana Elections 2023: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అదికారంలోకి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తనదైలి శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు నర్సాపూర్‌లో పర్యటించారు రేవంత్. అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో సీఎం కేసీఆర్ (CM KCR) పై నిప్పులు చెరిగారు.

ALSO READ: ఒకే విడతలో రూ.10లక్షలు.. సీఎం కేసీఆర్ సంచలన హామీ

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి పదేళ్లు అయ్యిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలో ఉన్నప్పుడు 25 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

గత ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ (BRS) చేసిన అభివృద్ధిని చెప్పకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు సీపీఐ కాంగ్రెస్ తో జతకట్టిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తండాలకు రూ.100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ALSO READ: కొట్టుకున్న BRS, కాంగ్రెస్ శ్రేణులు.. ఎక్కడంటే?

బెల్టు షాపుల్లో తెలంగాణను మొదటి స్థానంలో ఉంచిన ఘనుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. నమ్మక డ్రోజులను అసెంబ్లీ గేటు తాకనివ్వద్దని రేవంత్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టమని తెలిపారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. కాంగ్రెస్ ని తిడితే ఉసురుతాగిలిపోతారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని వెల్లడించారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు