దానికి ఎక్కువమంది బానిసలయ్యారు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు!

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

New Update
దానికి ఎక్కువమంది బానిసలయ్యారు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు!

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పర్యటించారు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (Annamalai). ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీని గెలిపించబోతున్నారని అన్నారు.

ALSO READ: BREAKING: నన్ను చంపేస్తారు.. బర్రెలక్క సంచలన ప్రెస్ మీట్!

తమిళనాడు (Tamil Nadu), తెలంగాణకు (Telangana) పోలికలున్నాయని అన్నామలై అన్నారు. అక్కడా ఇక్కడా అవినీతి, కుటుంబ పార్టీలు ఏలుతున్నాయని విమర్శించారు. రెండు రాష్ట్రాల్లో విద్య, వైద్యం సహా అన్నిరంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయ్ లెట్స్ లేకపోవడం దారుణమని అన్నారు.

రెండు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని నమ్ముకున్నాయని అన్నారు. తమిళనాడులో 18-60 మధ్య వయసున్న 90 శాతం మంది మగవాళ్లు మద్యానికి బానిసలయ్యారని పేర్కొన్నారు. తమిళనాడులో 9మంది మంత్రుల మీద అవినీతి కేసులు ఉన్నాయని.. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉందని తెలిపారు.

ALSO READ: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన కీలక నేత!

బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కోరుకుంటున్న తెలంగాణ ప్రజలు నవంబర్ 30 కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. వాళ్లంతా మోదీ వైపు, బీజేపీ వైపు నిలుస్తారని నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఐటీ హబ్ అని ప్రచారం చేసుకుంటున్నారు... కానీ ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య గురించి ఏం చెప్తారు?.. ధరణి అవకతవకలకు ఏం సమాధానం చెప్తారు? అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కేసీఆర్ పాలనలో టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ 17సార్లు లీకైందని అన్నారు. యువత జీవితాలతో ప్రభుత్వం ఆడుకుందని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి, కుటుంబపార్టీలే అని విమర్శించారు. 9 ఏళ్ల మోదీ (Modi) పాలన చూశారు...పదోస్థానం నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదిగిందని తెలిపారు. యువతతో పాటు మహిళలు, రైతులు బీజేపీని సమర్థిస్తారన్న నమ్మకం తనకు ఉందని అన్నారు.

Advertisment
తాజా కథనాలు