Telangana Elections: మరికొన్ని గంటల్లో పోలింగ్.. సీఈవో వికాస్ రాజ్ సంచలన ప్రకటన.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పర్వం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో సైలెంట్ మెటీరియల్ ప్రారంభమైందన్నారు. ఎలాంటి ఎన్నికల మెటీరియల్‌ను ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు. By Shiva.K 28 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పర్వం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో సైలెంట్ మెటీరియల్ ప్రారంభమైందన్నారు. ఎలాంటి ఎన్నికల మెటీరియల్‌ను ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు. స్థానికేతరులు నియోజకవర్గాలు వదిలి వెళ్లాలని ఆదేశించారు వికాస్ రాజ్. రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసి నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక వివరాలు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు నవంబర్ 30న పోలింగ్ జరుగుతుందన్నారు. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ ఉంటుందన్నారు. ఇక ఎన్నికల విధుల్లో 1.40 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు సీఈవో. తెలంగాణలో తొలిసారి హోమ్ ఓటింగ్ నిర్వహించామని, 27,175 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు సీఈవో. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పరిశీలించడం జరుగుతుందన్నారు. ఇక నిర్దేశించిన రూట్లలోనే పోలింగ్ సిబ్బంది ప్రయాణించాలని ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు. బుధవారం రాత్రి వరకు ఎపిక్ కార్డుల పంపిణీ పూర్తవుతుందని చెప్పారు సీఈవో. ఎపిక్ కార్డులు లేని ఓటర్లు.. తమ వెంట ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని పోలింగ్ బూత్‌కు వెళ్లాలని స్పష్టం చేశారు. మాక్ పోల్ కోసం నవంబర్ 30వ తేదీన ఉదయం 5.30 కల్లా పోలింగ్ ఏజెంట్లు రావాలి. ఈవీఎంలను పోలింగ్ ఏజెంట్లు ముట్టుకోకూడదు. ఒకవేళ ఎవరైనా ఈవీఎంలను టచ్ చేస్తే.. పోలింగ్ అధికారులు వారిని బయటకు పంపించేస్తారని స్పష్టం చేశారు. అలాగే, పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించరని స్పస్టం చేశారు సీఈవో. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజవర్గాలకు 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. వీరిలో 221 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. అలాగే, తెలంగాణలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో పురుషులు - 1,62,98,418, మహిళలు - 1,63,01,705 మంది ఉన్నారని తెలిపారు. బుధవారం, గురువారం హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ఎన్నికల సంఘం. అలాగే, గురువారం నాడు తెలంగాణ వ్యాప్తంగా సెలవు ప్రకటించింది సీఈవో. ఇక మద్యం షాపులు మంగళవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు బంద్ ఉంటాయని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. Also Read: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం.. ముగిసిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం.. ఇప్పటివరకు సర్వేల లెక్కలివే! #telangana-elections-2023 #telangana-elections #telangana-politics #telangana-election-commission మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి