Telangana Elections: ముగిసిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం.. ఇప్పటివరకు సర్వేల లెక్కలివే! తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ సర్వే సంస్థలు ప్రీ పోల్ సర్వే రిపోర్ట్స్‌ను వెల్లడించాయి. మెజార్టీ సంస్థలు బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని చెబుతున్నారు. కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని కొన్ని సంస్థలు చెబుతున్నారు. అధికారం ఏ పార్టీదో తేలాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే. By Shiva.K 28 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections Survey Reports: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం కూడా ముగియనుంది. చివరి రోజు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోడ్ షో లతో హడావుడి చేస్తున్నారు. మరొక్క రోజు గడిస్తే.. ఏ పార్టీ భవితవ్యం ఏంటనేది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంటుంది. డిసెంబర్ 3న ఇక తెలంగాణను ఏలేది ఏ పార్టీ అనేది తేలిపోతుంది. ఓటర్లు ఎవరిని దీవిస్తారు? ఎవరికి పట్టం కడతారు? అనే అంశంపై ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజకీయ నేతలు. అయితే, అంతకంటే ముందుగానే.. జనం నాడి ఏంటి? ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఏ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు? అనే అంశాన్ని తేల్చేందుకు అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ప్రజల మూడ్ ఏంటో తెలుసుకున్నాయి. వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో నిర్ధారించాయి. వీటిలో ప్రధానంగా ఏబీపీ-సీఓటర్ సర్వే, డెమోక్రసీ టైమ్స్ నెట్వర్క్, జనతా కా మూడ్, సౌత్ ఫస్ట్, సీ నెక్ట్స్ సర్వే, రాజ్‌నీతి, ఆత్మసాక్షి, లోక్‌పోల్, ఇండియాటీవీ-సీఎన్ఎక్స్, మిషన్ చాణక్య సర్వేలన్నీ తమ ప్రీ పోల్ సర్వే రిపోర్ట్‌ను విడుదల చేశాయి. ఈ సర్వేలు తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో లెక్కలతో సమా వివరాలను వెల్లడించాయి. మరి ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం.. ఆత్మసాక్షి సర్వే.. మొత్తం - 119 బీఆర్ఎస్ పార్టీ - 64-70 కాంగ్రెస్ పార్టీ - 37-43 బీజేపీ - 5-6 ఎంఐఎం - 6-7 ఇతరులు - 1-2 మరో 6 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. రాజ్‌నీతి సర్వే.. బీఆర్ఎస్ - 75(+/- 6) కాంగ్రెస్ - 31(+/- 4) బీజేపీ - 5(+/- 2) ఎంఐఎం - 7 ఇతరులు - 1 లోక్‌పోల్ సర్వే.. బీఆర్ఎస్ - 36 - 39 కాంగ్రెస్ - 69 - 72 ఏఐఎంఐఎం - 5 - 6 బీజేపీ - 2 - 3 ఇతరులు - 0 - 1 ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ సర్వే.. బీఆర్ఎస్ - 70 కాంగ్రెస్ - 30 బీజేపీ - 7 ఎంఐఎం - 7 ఇతరులు - 1 డెమోక్రసీ టైమ్స్ నెట్వర్క్ సర్వే.. మొత్తం - 119 బీఆర్ఎస్ - 45 కాంగ్రెస్ - 42 బీజేపీ 4 ఎంఐఎం - 6 టఫ్ ఫైట్ - 22 జనతా కా మూడ్ సర్వే.. బీఆర్ఎస్ - 72 - 75 కాంగ్రెస్ - 31 - 36 బీజేపీ - 04 - 06 ఎంఐఎం - 06 - 07 సీ నెక్ట్స్ సర్వే.. బీఆర్ఎస్ - 14 కాంగ్రెస్ - 91 బీజేపీ - 5 ఎంఐఎం - 4 బీఎస్పీ - 1 4-5 స్థానాల్లో హోరా హోరీ పోటీ ఉంటుంది. సౌత్ ఫస్ట్.. బీఆర్ఎస్ - 41 - 46 కాంగ్రెస్ - 57 - 62 బీజేపీ - 3 - 6 ఎంఐఎం - 6 - 7 సీ-ఓటర్ ఒపీనియన్ పోల్.. బీఆర్ఎస్ - 66 కాంగ్రెస్ - 41 బీజేపీ - 5 ఎంఐఎం - 7 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సర్వే సంస్థలు ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నాయి. నియోజకవర్గాల వారీగా శాంపిల్స్ సేకరించి.. ప్రజల మూడ్‌ను వెల్లడించాయి. దాదాపు మెజార్టీ సర్వేలు మూడవ సారి కూడా బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణలో అధికారం చేపడుతుందని అంచనా వేశాయి. రెండు, మూడు సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి. ఏది ఏమైనా.. ఈ సర్వేలే పార్టీ గెలుపోటములకు ప్రామాణికం అని చెప్పలేం. గతంలో సర్వే సంస్థలు ఇచ్చిన అనేక రిపోర్టులు తలకిందులైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓటరు నిర్ణయం ఏంటనేది తెలియాలంటే.. డిసెంబర్ 3వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. #telangana-elections #telangana-politics #telangana-pre-poll-survey #telangana-elections-survey-report #telangana-political-news #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి