/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/RGV-PK--jpg.webp)
Telangana Elections 2023: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). వరుస జిల్లాల పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు పవన్. ఇదిలా ఉండగా ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలల్లో నిలిచే ప్రముఖ దర్శకుడి రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) పవన్ కళ్యాణ్ పై సటైర్లు వేశారు.
ALSO READ: రూ.15 లక్షలు వచ్చాయా?.. మోదీపై ఖర్గే చురకలు!
ఆర్జీవీ (RGV) ట్విట్టర్(X) వేదికగా పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారాన్ని ఉద్దేశిస్తూ విమర్శించారు. 'ఇంతకంటే ఎక్కువ నిరాసక్తమైన మరియు అజాగ్రత్త ప్రచారాన్ని ఎప్పుడూ చూడలేదు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉన్నారు. అతను మాట్లాడుతున్న మైక్ సౌండ్ గురించి కూడా అతను లేదా నిర్వాహకులు బాధపడటం లేదు. అతనితో పోలిస్తే బర్రెలక్క చాలా మెరుగ్గా ఉంది' అంటూ రాసుకొచ్చారు.
Never seen a more disinterested and more careless campaign more than @PawanKalyan ‘s in telangana😳 Neither him nor the organisers seem to bother even about the Mike sound from which he is speaking … Compared to him Barrelakka’s is far better https://t.co/YupPwSfnRt
— Ram Gopal Varma (@RGVzoomin) November 25, 2023
అయితే, పవన్ కళ్యాణ్ కంటే కొల్లాపూర్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ శిరీష బెటర్ అంటూ ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. అర్జీవికి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు.
Just hear the MIKE SOUND in all his meetings in telangana in last few days ..Sheer DISINTEREST from the ORGANISERS https://t.co/beFVoju8ZV
— Ram Gopal Varma (@RGVzoomin) November 25, 2023
ALSO READ: రైతులకు రూ.300కే యూరియా.. కామారెడ్డిలో మోదీ!