నేడే సీఎల్పీ సమావేశం.. సీఎం ఆయనేనా?

కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశం గచ్చిబౌలీలోని ఎల్లా హోటల్ లో కాసేపట్లో మొదలుకాబోతుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకూ సీఎం ఎవరనే విషయంపై క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. 64 మంది అభిప్రాయం వెల్లడించగానే సాయంత్రంలోపు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.

New Update
నేడే సీఎల్పీ సమావేశం.. సీఎం ఆయనేనా?

Telangana Congress CLP Meeting: తెలంగాణలో భారీ విజయం సాధించిన కాంగ్రెస్ వీలైనంత త్వరగా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఎన్నికైన ఎమ్మెల్యేలంతా సోమవారం ఉదయమే గచ్చిబౌలీలోని ఎల్లా హోటల్ కు చేరుకుంటున్నారు. ఇక ఇప్పటికే హైదరాబాద్‌లో మకాం వేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shiva Kumar), ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకురాలు దీపాదాస్‌మున్షీ, ఇన్‌ఛార్జి ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy), ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి తదితరులు రాత్రినుంచి ఆ హోటల్ లోనే స్టే చేస్తున్నారు.

ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం బ్రేక్ ఫాస్ట్ సెషన్ కొనసాగుతోందని, ఈ రోజు సాయంత్రం వరకూ సీఎం ఎవరనే విషయంపై క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం తర్వాత అధిష్ఠానంతో సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది గవర్నర్‌కు తెలియజేస్తారని.. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు ఈ పదవికి పోటీ పడుతున్న నేపథ్యంలో సీఎల్పీ భేటీ తర్వాతనే అధికారికంగా సీఎం అభ్యర్థి పేరు వెలువడే అవకాశం ఉంది. అయితే రేవంత్ కు సీఎం ఇస్తే ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క సపోర్టు చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ముఖ్యమంత్రి విషయంలో ఏకపక్ష నిర్ణయం ఉండబోదని, సోనియా, రాహుల్ గాంధీ సమక్షంలోనే అభిప్రాయ సేకరణ మేరకు తుది నిర్ణయం ఉండబోతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటే రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also read :Telangana Elections: ఈ సారి అసెంబ్లీలోకి 10 మంది మహిళలు.. లిస్ట్ ఇదే!

ఇదిలావుంటే.. ఆదివారం ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్‌ ప్రతినిధిబృందం అదే రాత్రి గవర్నర్‌ తమిళిసైని కలవగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆమె సంసిద్ధత తెలిపారు. ఈ క్రమంలోనే రాజ్‌భవన్‌ బయట పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. సోమవారం ఉదయం సీఎల్పీ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని ఆయన వివరించారు. అనంతరం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు. వాస్తవానికి సీఎల్పీ సమావేశం ఆదివారం రాత్రే నిర్వహించాలని భావించామని, కొత్త ఎమ్మెల్యేలంతా రాత్రి నగరానికి చేరుకోవడంలో ఆలస్యం జరిగినట్లు ఆయన వివరించారు.

Advertisment
తాజా కథనాలు