Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాటల తూటాలతో రాజకీయ నాయకులు చలికాలంలో కూడా వేడిని రాజేస్తున్నారు. కొడంగల్ (Kodangal) బీఆర్ఎస్ సభలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్ (KCR). రేవంత్ టికెట్లు అమ్ముకున్నాడని కాంగ్రెస్ నేతలే అంటున్నారని.. చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డికి ఇంకా సిగ్గు రాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కాలేడని పేర్కొన్నారు. రేవంత్ కు నీతి లేదు, పద్ధతి లేదని కేసీఆర్ విమర్శించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ALSO READ: పాల ప్యాకెట్లపై GST… హరీష్ రావు కీలక వ్యాఖ్యలు!
కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి పోతుందన్న భయం పట్టుకుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని కేసీఆర్ అంటున్నాడని తెలిపారు. నిజామాబాద్ సాక్షిగా చెబుతున్న కేసీఆర్.. 80 సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని అన్నారు. 80 సీట్ల కంటే తక్కువ సీట్లు వస్తే ఏ శిక్షకైనా సిద్దమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
నిజామాబాద్‌లో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి పదేళ్లు గడిచిందని విమర్శించారు. హామీ ఇచ్చి పదేళ్లు గడిచినా చక్కెర పరిశ్రమను ఎందుకు తెరిపించలేదు? అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మద్దతు ధర కోసం అడిగిన ఎర్రజొన్న రైతులపై పోలీసు కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను వేధించారని మండిపడ్డారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం అమలు చేస్తామని అన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ALSO READ: జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్.. ఎల్లుండే సుప్రీంలో విచారణ!