Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కామారెడ్డిలో పర్యటించారు ప్రధాని మోదీ. కామారెడ్డిలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: రూ.15 లక్షలు వచ్చాయా?.. మోదీపై ఖర్గే చురకలు!
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నుంచి తెలంగాణకు ముక్తి లభించాలని అన్నారు. 9 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారు.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని మాట ఇచ్చామని అన్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ బీసీల కోసం ఏం చేయలేదని ఫైర్ అయ్యారు. బీజేపీ చెప్పింది చేసి చూపిస్తుందని అన్నారు. వాగ్దానం ఇచ్చామంటే చేసి తీరుతాం.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాం.. గ్యారంటీలను పూర్తి చేయడమే మోదీ అని తేల్చి చెప్పారు. తెలంగాణలో మాదిగలకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. మాదిగల సాధికారతకు కృషి చేస్తున్నామని తెలిపారు.
రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం తీసుకొని వచ్చామని మోదీ తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.2.75 లక్షల కోట్లు జమ చేశామని వెల్లడించారు. రైతులకు రూ.300కే యూరియా బస్తా సరఫరా చేస్తున్నామని అన్నారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ALSO READ: పున్నమ్మా!.. అంటూ పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి సెటైర్లు!