TS Elections: మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే... ఖర్గే చురకలు!

మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే అని అన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. వారిద్దరికీ పేదల కష్టాలు పట్టవని విమర్శించారు. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని.. భూమి, ఇసుక, మద్యం కుంభకోణాల్లో కేసీఆర్‌ కుటుంబం కూరుకుపోయిందని ఫైర్ అయ్యారు.

New Update
TS Elections: మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే... ఖర్గే చురకలు!

Telangana Elections 2023: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తెలంగాణలో పర్యటించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikharjuna Kharge). నల్గొండలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ (PM Modi) కాంగ్రెస్‌ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఖర్గే. నెహ్రూ స్థాపించిన నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికపై (National Herald Paper) కుట్ర చేశారని ఫైర్ అయ్యారు.

ALSO READ: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సంచలన సవాల్!

నల్గొండలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభలో మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఏం చేయలేదన్న కేసీఆర్‌ (KCR) చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేసీఆర్‌.. ఇందిరా గాంధీని కూడా తిడుతున్నారని ఖర్గే ధ్వజమెత్తారు. మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే అని విమర్శించారు. వారిద్దరికీ పేదల కష్టాలు పట్టవని అన్నారు.

కాంగ్రెస్ చేపట్టిన హరిత విప్లవం వల్లే దేశంలో ఆహార కొరత తీరిందని తెలిపారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ లేకుంటే తెలంగాణ ఎలా ఉండేది? అని ప్రశించారు. తెలంగాణలో కట్టిన అన్నీ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే నిర్మించబడ్డాయని పేర్కొన్నారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు కుంగిపోతున్నాయని అని అన్నారు.

ALSO READ: పాల ప్యాకెట్లపై GST… హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు!

దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చింది ఇందిరమ్మే అని అన్నారు. రైతులకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యం అని స్పష్టం చేశారు. దళితులు, నిరుపేదలకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యం అని తెలిపారు. హరిత, శ్వేత విప్లవం వచ్చినప్పుడు కేసీఆర్‌ ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. మోదీతో అంటకాగడమే కేసీఆర్‌కు తెలుసు అని విమర్శించారు. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. భూమి, ఇసుక, మద్యం కుంభకోణాల్లో కేసీఆర్‌ కుటుంబం కూరుకుపోయిందని ఫైర్ అయ్యారు.

Advertisment
తాజా కథనాలు