Telangana Elections 2023: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలు బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ (KCR) తెలంగాణను దివాలా తీశారని మండిపడ్డారు. గతంలో తెలంగాణను పాలించిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) రాష్ట్రాన్ని నాశనం చేసిందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వద్దని అన్నారు.
25, 26, 27 తేదీల్లో ప్రధాని మోదీ (PM Modi) తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని కిషన్ రెడ్డి అన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. బీసీ సీఎం అంశం... బీసీ సామాజిక వర్గంలో ప్రతీ ఇంటా చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. బీసీ సీఎం అనే నినాదానికి బీసీ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.. ఇది బీజేపీకి అదనంగా కలిసి రానుందని అన్నారు.
ALSO READ: పాల ప్యాకెట్లపై GST… హరీష్ రావు కీలక వ్యాఖ్యలు!
ఒక బీసీ అభ్యర్థిని సీఎంను చేసే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు బీసీలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే అవినీతి ఉంటుంది... అస్టిరత ఉంటుందని తెలిపారు. దలీతున్ని సీఎం చేసే దమ్ము దైర్యం కేసీఆర్ కు ఉందా? అని సవాల్ విసిరారు. కేటీఆర్ (KTR) ను సీఎం చేసినట్టు ఫార్మ్ హౌస్ లో పడుకొని కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని విమర్శించారు.
ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు రావాలంటే బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కుటుంబ పెత్తనం లేనటువంటి పార్టీ బీజేపీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలని ఎద్దేవా చేశారు. అవినీతి, బంధుప్రీతి ఆ పార్టీల విధానం అని ఆరోపించారు. ధర్మం, దేశం బీజేపీ విధానం అని స్పష్టం చేశారు.
ALSO READ: జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్.. ఎల్లుండే సుప్రీంలో విచారణ!
తల తోక లేకుండా మాట్లాడటం కేసీఆర్ కుటుంబానికి అలవాటు అని విమర్శించారు. దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ మెడికల్ కాలేజీలకు రాసిన ఉత్తరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సిగ్గు లేకుండా కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అసలు కేసీఆర్ మెడికల్ కాలేజీలకు దరఖాస్తు చేసుకోలేదని అన్నారు. ఈ 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని లెక్కలు చెప్పారు.
రైతులారా డిసెంబర్ మూడు వరకు వడ్లను అమ్ముకొకండి.... వరి కనీస ధర 3,100 రూపాయలు బీజేపీ ఇస్తుందని రైతులకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మూడో తేదీ తరవాత బీజేపీ అధికారంలోకి వస్తుంది .. వడ్లను కొంటుందని అన్నారు. రేపు బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఉచిత కరెంట్ ఇస్తుందని హామీ ఇచ్చారు. అకౌంటబిలిటీ కోసమే మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పిందని స్పష్టం చేశారు.