KCR: కాంగ్రెస్ వల్లే రైతు బంధు ఆగింది.. కేసీఆర్ గరం!

కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం వల్లే ఈసీ రైతు బంధు నిధులు ఆపేసిందని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ గెలిస్తే.. తొలి మంత్రివర్గ సమావేశంలో అసైన్డ్‌ భూములకు పట్టాలపై సంతకం చేస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్.

New Update
KCR : కేసీఆర్ మాస్ రీ-ఎంట్రీ.. అక్కడ తొలి బహిరంగ సభతో.

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల వేళ రైతు బంధు రద్దు అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సీఎం కేసీఆర్ (CM KCR) ఎన్నికల కమిషన్ (Election Commission) రైతు బంధు (Rythu Bandhu) నిధుల విడుదలకు అనుమతిని రద్దు చేయడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్లలో బీఆర్ఎస్ (BRS)  ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. కాంగ్రెస్  పార్టీపై (Congress Party) విరుచుకుపడ్డారు.

ALSO READ: రైతుబంధుకు పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్.. ఈసీకి బీఆర్ఎస్ రిక్వెస్ట్!

ఎన్నికల ముందు అభ్యర్థులతో పాటు వారి పార్టీల చరిత్ర, దృక్పథం చూడాలని కేసీఆర్‌ అన్నారు. ఉన్న తెలంగాణను 1956లో ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని ఫైర్ అయ్యారు. తెలంగాణను ఆంధ్రలో కలపడం వల్ల 50 ఏళ్లు ఎన్నో గోసలు పడ్డాం అని పేర్కొన్నారు. గులాబీ జెండా పట్టి అందరం పోరాడితే తెలంగాణ ప్రకటించారని పేర్కొన్నారు. 2004లో ప్రకటించిన తెలంగాణను 2014 వరకు ఇవ్వలేదని.. తాను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాక కాంగ్రెస్‌ పార్టీ దిగివచ్చిందని వెల్లడించారు.

రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఓటును వివేకంతో వేయాలని కేసీఆర్ కోరారు. ఎన్నికల్లో గెలిచేందుకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని.. రైతుబంధు ఆపాలని కాంగ్రెస్‌ నేతలు గత నెలలో ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. నేను విజ్ఞప్తి చేస్తే.. ఈనెల 28న రైతుబంధు ఇచ్చేందుకు ఈసీ అనుమతి ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు మరోసారి ఫిర్యాదు చేస్తే.. రైతుబంధును ఈసీ మళ్లీ ఆపేసిందని ధ్వజమెత్తారు.

ALSO READ: BREAKING: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్!

మేం తెచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల రైతుల భూములు నిశ్చింతగా ఉన్నాయని కేసీఆర్ అన్నారు. రైతుల వేలిముద్ర లేకుండా భూ రికార్డులను సీఎం కూడా మార్చలేరని స్పష్టం చేశారు. కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. ఎవరైనా మూడేళ్లు భూమిని కౌలుకు ఇస్తే.. ఆ భూమి మీద హక్కులు పోతాయని కేసీఆర్‌ హెచ్చరించారు. బీఆర్ఎస్ గెలిస్తే.. తొలి మంత్రివర్గ సమావేశంలో అసైన్డ్‌ భూములకు పట్టాలపై సంతకం చేస్తానని హామీఇచ్చారు కేసీఆర్.

Advertisment
Advertisment
తాజా కథనాలు