Harish Rao: పాల ప్యాకెట్లపై GST... హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు!

కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. బీజేపీ హయాంలోనే రూపాయి విలువ తగ్గిందని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరగడానికి కారణం బీజేపీ కాదా? అని ప్రశ్నించారు.

New Update
Harish Rao: పాల ప్యాకెట్లపై GST... హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు!

Telangana Elections 2023: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ (BRS) పార్టీని తెలంగాణలో మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు జిల్లాల పర్యటన చేపట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలపై విమర్శల దాడి చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అని అన్నారు. నిన్న(మంగళవారం) తెలంగాణ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్.

ALSO READ: తెలంగాణ బీజేపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఢిల్లీలోనేమో బీఆర్ఎస్ పార్టీపై పొగడ్తలు.. ఇక్కడికి వచ్చి విమర్శలా? అంటూ కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పై ఫైర్ అయ్యారు. దేశంలో కేసీఆర్‌ (KCR) ఒక్కరే రైతు పక్షపాతి అని కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్‌లు రైతు వ్యతిరేక పార్టీలని మండిపడ్డారు.

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు పెట్టారని తెలిపారు. తెలంగాణలో కూడా పంట పొలాల మోటార్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్ర సర్కార్‌పై కేంద్రం ఒత్తిడి తెచ్చిందని అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టకపోతే కేంద్రం నిధులు ఇవ్వమన్నా.. కేసీఆర్‌ రైతుల పక్షానే నిలిచారని పేర్కొన్నారు.

ALSO READ: ఆ సీనియర్ హీరో నన్ను ఒక రాత్రికి రమ్మన్నాడు.. త‌మిళ న‌టి

కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌ తరహాలోనే తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టాలని రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలకు ఓటేస్తే.. మోటార్లకు మీటర్లు బిగించడమని ఒప్పుకున్నట్లే అని తెలంగాణ ప్రజలను హెచ్చరించారు.

అప్పుల విషయంలో కేంద్రం కంటే తెలంగాణనే మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉంటే అందులో 22 రాష్ట్రాల కంటే తక్కువ అప్పే తెలంగాణ సర్కార్ చేసిందని తెలిపారు. మోదీ (Modi) హయాంలో అప్పులతో పాటు నిరుద్యోగులు పెరిగారని మండిపడ్డారు. పాల ప్యాకెట్లపై కూడా బీజేపీ జీఎస్టీ (GST) విధించిందని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో రూపాయి విలువ పడిపోయిందని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.

Advertisment
తాజా కథనాలు