Telangana: తెలంగాణలో 608 నామినేషన్ల తిరస్కరణ..

తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్ల వేయగా.. 608 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గరైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

New Update
Telangana: తెలంగాణలో 608 నామినేషన్ల తిరస్కరణ..

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసిన దరిమిలా.. తదనంతర ఘట్టం కూడా పర్తయ్యింది. అదేనండీ.. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు. తెలంగాణ(Telangana)లోని 119 నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వీరిలో 608 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరించారు అధికారులు. నాగార్జునసాగర్‌(Nagarjuna Sagar)లో మాజీ మంత్రి కె.జానారెడ్డి, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ భార్య జమున వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల పరిశీలన పూర్తవగా.. నెల 15వ తేదీ వరకు నామినేషణ్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ రోజు సాయంత్రంలోపు ఎన్నికల బరిలో ఎవరు ఉన్నారు.. ఎవరు తప్పుకున్నారు అనే అంశంపై, అభ్యర్థుల వివరాలపై క్లారిటీ వస్తుంది.

నామినేషన్ల పరిశీలన సందర్భంగా అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలివే..

నామినేషన్ల పరిశీలన సందర్భంగా అభ్యర్థులు తమ తమ అభ్యంతరాలను అధికారులకు తెలియజేశారు. ఈ అభ్యంతరాలకు మేరకు కొన్ని నామినేషన్లు తిరస్కరణకు గురవగా.. మరికొన్ని నామినేషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఉండటం వలన తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేయాలి. అంతకు మించి పోటీకి అంగీకరించరు. అయితే, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మాత్రం రెండు మించి స్థానాల్లో నామినేషన్లు ఫైల్ చేశారు. దాంతో వారి నామినేషన్లలో రెండింటిని మాత్రమే ఆమోదించారు. మిగతా వాటిని తిరస్కరించారు.

ఇక అభ్యంతరాల విషయానికి వస్తే.. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ సమర్పించిన అఫిడవిట్‌పై తుమ్మల నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆస్తులు సహా అనేక వివరాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేయగా.. అధికారులు వాటిని తోసిపుచ్చారు. దేవరకద్రలో కాంగ్రెస్‌ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటుహక్కు ఉందంటూ బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. అయితే, అప్పటికే ఆయన తన ఓటు రద్దు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. దాంతో అధికారులు మధుసూదన్ నామినేషన్‌ను ఆమోదించారు. పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని నామినేషన్‌పైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యశస్విని పేరు మీద మూడు వేర్వేరు చిరునామాలు ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ప్రత్యర్థులు. అయితే, నిబంధనల ప్రకారం అలా చిరునామాలు ఉండటం తప్పేం కాదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇలా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో దాఖలైన నామినేషన్లలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 608 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు.

Also Read:

టార్గెట్ నకిరేకల్.. వేముల వీరేశం ఓటమికి కేసీఆర్ స్కెచ్ ఇదే!

మేం అధికారంలోకి వస్తే ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు