Telangana Election: బీ ఫామ్ మాకు పవిత్ర గ్రంథం.. ఈటల ఆ ఆలోచన మానుకోవాలి: మంత్రి గంగుల

చారిత్రక నగరం కరీంనగర్‌ అని మంత్రి గంగుల అన్నారు. ఉద్యమాలకు పెట్టింది పేరు ఈ గడ్డ.. స్వరాష్ట్ర సాధన కోసం సింహ గర్జనతో సమరశంఖాన్ని పూరించింది ఇక్కడి నుండే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్ జిల్లాలో నిర్మించారని అన్నారు. ఎన్నింటికో వేదికగా నిలిచిన ఘనత కరీంనగర్‌ది అన్నారు.

New Update
Telangana Election: బీ ఫామ్ మాకు పవిత్ర గ్రంథం.. ఈటల ఆ ఆలోచన మానుకోవాలి: మంత్రి గంగుల

కరీంనగర్‌లో మంగళవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన బి ఫామ్ మాకు పవిత్ర గ్రంథంతో సమానమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 2018 ఎన్నికల్లో తనను ఓడించేందుకు కుట్రలు పన్నారని ఈటెల చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈటెలది దుర్మార్గాపు ఆలోచన అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన బిఫామ్ మాకు పవిత్ర గ్రంథంతో సమానమని.. కేసీఆర్‌ ఫోటోతో గెలిచి... ఏళ్ళ తరబడి పదవులు అనుభవించిన ఈటెల రాజేందర్‌ ఇప్పుడు కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గంగుల దుయ్యపట్టారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఫోటో లేకుండా గెలువగలవా..? అని ఈటెలను గంగుల ప్రశ్నించారు. ఉద్యమాలకు పెట్టింది పేరు ఈ గడ్డ అని, స్వరాష్ట్ర సాధన కోసం సింహ గర్జనతో సమరశంఖాన్ని పూరించింది ఇక్కడి నుండేనని మంత్రి అన్నారు.

మరోసారి ఆశీర్వదించాలి

కరీంనగర్‌లో రేపు ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ఉంటుందన్నారు. ఈ సభలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొంటున్నారని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున సభలో పాల్గొని ఆశీర్వదించాలని ఆయన కోరారు. నా చేతులు బలోపేతం చేయండి... మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని గంగుల చెప్పారు. విలువైన ఓటును వృధా చేయొద్దని.. అభివృద్ధికి పట్టం కట్టండని మంత్రి పిలుపునిచ్చారు. స్వలాభం కోసం, స్వార్థం కోసం పోటీ చేసేవారిని ఆదరించొద్దని ఆయన కోరారు. బీఆర్ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, 9వ తేదీన తొలి నామినేషన్, 10వ తేదీన 2వ నామినేషన్ దాఖలు చేస్తానని గంగుల కమలాకర్ తెలిపారు. బొమ్మకల్ హనుమాన్ టెంపుల్ నుంచి ప్రచారం ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయననని.. వేరే పార్టీకి ఓటు వేస్తే వృధా అవుతుందని...తనకే ఓటి వేసి గెలిపించాలని ఆయన కోరారు.

గొప్పగా అభివృద్ధి చేశారు

కేసీఆర్‌కు ఇష్టమైన నగరం కరీంనగర్ అన్నారు. ఎన్నిక ఏదైనా కేసీఆర్‌కు అండగా నిలిచిన నగరం కరీంనగర్ అన్నారు. నన్ను 3 సార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు.. సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామన్నారు. 10 సంవత్సరాల పాలనలో నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేశామన్నారు. మట్టి రోడ్డు లేకుండా చేసిన ఘటన బీఆర్ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీతో నగరం ప్రాశస్త్యం పెరిగిందన్నారు. దీనిని పూర్తి చేసే బాధ్యత మాదన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్‌ను గెలిపించాలన్నారు. కేసీఆర్ పాలనలో లా అండ్ ఆర్డర్ భేషుగ్గా ఉందని మంత్రి తెలిపారు. శాంతి భద్రతలు ఉన్న చోటే అభివృద్ధి జరుగుతుందన్నారు. కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ క్షేమంగా ఉంటుందని మంత్రి గంగుల తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు