TS e Challan:మొదటి రోజే ట్రాఫిక్ చలాన్ల వెబ్ సైట్ క్రాష్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు నుంచి జనవరి పదివరకు చలాన్లను చెల్లించుకోవచ్చని తెలిపింది. కానీ దానికి చెందిన వెబ్ సైట్ మాత్రం క్రాష్ అయింది. ఒకేసారి అధిక మొత్తంలో లాగిన్ అవడంతో ఇది జరిగింది. By Manogna alamuru 26 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TS e Challan: ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు కొత్త రాయితీ విధానాన్ని ప్రవేశపెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తోంది కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం. డిసెంబర్ 26 నుంచి అంటే ఈరోజు నుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ జరిమానాలను రాయితీతో చెల్లించొచ్చు. టూవీలర్స్ కు 80 శాతం రాయితీని ఇవ్వగా కార్ల ఇతర పెద్ద వాహనాలకు కూడా 60 శాతం రాయితీని ఇస్తోంది. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం.. వాహనదారులకు జరిమానాల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని గవర్నమెంట్ భావించింది. Also read:పరారీలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ ఈరోజు ఉదయం నుంచి ట్రాఫిక్ చలాన్లను చెల్లించడానికి వాహనదారులు పోటీపడ్డారు. దీంతో ఈ-చాలన్ వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. సైట్‌లో వెహికల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ చూపించడం లేదు. దీని మీద వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ట్రాఫిక్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 2022లో గత ప్రభుత్వం చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు కొత్త విధానాన్ని అమలు చేసింది. అదేంటంటే ట్రాఫిక్ చలానాలపై రాయితీ ప్రకటించడం. 2022లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ఖజానాలోకి భారీ డబ్బు సమకూరింది. ట్రాఫిక్ చలానాలు ప్రజలు కట్టరనుకున్న పోలీసుల ఆలోచలనకు వాహనదారులు ఊహించని షాక్ ఇచ్చారు. రాయితీ ఉండడంతో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న చలానాలు కూడా కట్టేశారు జనాలు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెండింగ్ చలానాలు కట్టడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.300 కోట్లు జమ అయ్యాయి. Website: https://echallan.tspolice.gov.in/ #hyderabad #traffic #telanagna #challan #ts-e-challan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి