Telangana DSC Notification 2024: 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నిన్న పాత నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 11,062 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), 2,629 స్కూల్ అసిస్టెంట్లు (SA), 727 లాంగ్వేజ్ పండిట్లు (LP), 182 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET), 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 220 పోస్టులు, 79 SA క్యాడర్ కింద ఖాళీలు ఉంటాయి. ఈ పోస్టులలో గత బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం నోటిఫై చేసిన 5,089 ఖాళీలు కూడా ఉన్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విద్యాశాఖ అధికారులతో కలిసి నోటిఫికేషన్ జారీ చేశారు సీఎం.
CLICK HERE FOR FULL NOTIFICATION
గతంలో డీఎస్సీకి 1.77 లక్షల మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. మునుపటి నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ తాజా నోటిఫికేషన్‌లో వారి దరఖాస్తులు అటోమేటిక్‌గా అప్లై అవుతాయి . వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (Computer Based Exam) జరిగే రిక్రూట్‌మెంట్ పరీక్షలు మే/జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. కొంతమంది అభ్యర్థులు SGT, SA లాంటి మల్టిపుల్ పోస్టులకు హాజరవుతారు, అందుకే వివిధ తేదీలలో నియామక పరీక్షలను నిర్వహించడానికి ప్లాన్ వేస్తున్నారు.
Also Read: అలెర్ట్.. అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ నుంచి కీలక అప్‌డేట్.. ఆ రూల్స్ ఛేంజ్!