ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష - బడ్జెట్ సమావేశాలపై చర్చ ఈ నెల 23 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ సెషన్‌లో సమస్వయ లోపం లేకుండా ఉండేందుకు సీనియర్ అధికారులు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు. By Manogna alamuru 21 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి CS Santhi Kumari: సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచారంతో సమాధానాలు పంపాలని ఆమె అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సెషన్‌లో సమన్వయ లోపం గ్యాప్ లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 25న ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శులు సందీప్‌కుమార్ సుల్తానియా, నవీన్ మిట్టల్, శైలజా రామయ్యర్, కార్యదర్శులు రఘునందన్‌రావు, బుద్ధ ప్రకాష్ జ్యోతి, వి కరుణ, లోకేష్ కుమార్, సిఐపిఆర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు Also Read:350 ఏళ్ళ తర్వాత ఇడియాకు తిరిగి వచ్చిన శివాజీ ఆయుధం #telangana #cs-santhi-kumari #budget-session మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి