TS Constable Training: తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థులకు బీఅలర్ట్. ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తయ్యింది. ఈ నేపథ్యంతో తర్వాతి అంకంపై టీఎస్ఎల్ పిఆర్ బి (TSLPRB) ఫోకస్ పెట్టింది. ఉద్యోగాలకు సెలక్ట్ అయిన అభ్యర్థుల ప్రవర్తన, పూర్వాపరాల పరిశీలనతోపాటు వైద్యపరీక్షలు జరగాల్సి ఉంది. అయితే సెలక్ట్ అయిన అభ్యర్థులు ముందుగానే ధ్రువీకరణపత్రాలపై గెజిటెడ్ అధికారుల సంతకాలతో కూడిన అటెస్టేషన్ పత్రాలను అక్టోబర్ 13లోగా సమర్పించాలి. ఈ ప్రక్రియ అంతా కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసు పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ ప్రక్రియన త్వరగా చేపడితే నవంబర్ 20వ తేదీ వరకు కొసాగనుంది. ఆలోపు పూర్తకానట్లయితే ట్రైనింగ్ మరింత ఆలస్యం కానుంది. 12వేల మంది పురుషుల, 2వేల మంది మహిళా అభ్యర్థులకు సంబంధించి ఎస్ బి విచారణ (SB Investigation) ప్రక్రియను తొందరగా చేపడితే నవంబర్ 20వ కొనసాగే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాతే కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఉప్పు తక్కువగా తింటున్న వారికి షాకింగ్ న్యూస్..!!
అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే...కమిషనరేట్లతోపాటు ఎస్పీ కార్యాలయాల పరిధిలోని ఎస్బీ తో సహా అన్ని విభాగాల పోలీసులు బందోబస్తు పనుల్లో చేరుతారు. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలీసులు పికెట్లు ఏర్పాటు చేయడం..స్థానిక పోలీసులతో పాటు కేంద్రం నుంచి వచ్చే బలగాలకు బందోబస్తు విధులను అప్పగిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులకు సంబంధించి ఎస్బీ విచారణకు ఆటంకం తప్పదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ 63 మంది అభ్యర్థులు ఖరారు.. లిస్ట్ ఇదే?
ఇక అటు నియామక ప్రక్రియలో కొత్త వివాదాలు వస్తున్నాయి. ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల (TS SI Constable Jobs) భర్తీలో చాలా మందికి అన్యాయం జరిగిందన్న అరోపణలు కూడా ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థుల కటాఫ్ మార్కుల కంటే ఈడబ్య్లూఎస్ అభ్యర్థుల కటాఫ్ మార్కులు చాలా తక్కువగా ఉండటమే ఇందు కారణం. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 587 ఎసై, 16వేల కానిస్టేబుల్ పోస్టులకు రిక్రూట్ మెంట్ గతేడాది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రిజర్వేషన్లపై కోర్టులో కేసులు ఉండగా...ఈ నోటిఫికేషన్ కు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించవని బోర్డు స్పష్టం చేసింది.