TS Constable Training: కానిస్టేబుల్ ఉద్యోగం పొందిన అభ్యర్థులకు అలర్ట్.. ట్రైనింగ్ మరింత ఆలస్యం?
తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థులకు బీఅర్ట్. ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తయ్యింది. ఈ నేపథ్యంతో తర్వాతి అంకంపై టీఎస్ఎల్ పిఆర్ బి ఫోకస్ పెట్టింది. ఉద్యోగాలకు సెలక్ట్ అయిన అభ్యర్థుల ప్రవర్తన, పూర్వాపరాల పరిశీలనతోపాటు వైద్యపరీక్షలు జరగాల్సి ఉంది. అయితే సెలక్ట్ అయిన అభ్యర్థులు ముందుగానే ధ్రువీకరణపత్రాలపై గెజిటెడ్ అధికారుల సంతకాలతో కూడిన అటెస్టేషన్ పత్రాలను అక్టోబర్ 13లోగా సమర్పించాలి. ఈ ప్రక్రియ అంతా కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసు పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ ప్రక్రియన త్వరగా చేపడితే నవంబర్ 20వ తేదీ వరకు కొసాగనుంది. ఆలోపు పూర్తకానట్లయితే ట్రైనింగ్ మరింత ఆలస్యం కానుంది. ఎందుకంటే తెలంగాణలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లయితే..ఈ ప్రక్రియను నిలిపివేసే అవకాశం ఉంటుంది.