Telangana Lok Sabha Candidates List: తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై పీఈసీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన లోక్‌సభ ఎన్నికల సీట్లకు వచ్చిన 309 దరఖాస్తుల్లో ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చ సాగింది. 309 మందికి సంబంధించిన జాబితాను ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యులకు అందజేశారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధికంగా మహబూబాబాద్ (Mahabubabad) ఎంపీ స్థానానికి 48 దరఖాస్తులు, అత్యల్పంగా మహబూబ్ నగర్ (Mahabubnagar) ఎంపీ స్థానానికి 4 దరఖాస్తులు వచ్చాయి. దీంట్లో ఒక్కో నియోజక వర్గానికి మూడు లేదా నాలుగు అభ్యర్ధులను పేర్లను సూచించాలని పీఈసీ నిర్ణయించుకుంది.
Also Read: Andhra Pradesh : విరాళాల మీద జనసేన అధినేత పవన్ కీలక నిర్ణయం
ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావహులు
1. వరంగల్ (ఎస్సీ)
అద్దంకి దయాకర్ (Addanki Dayakar), సిరిసిల్ల రాజయ్య , మోత్కుపల్లి నర్శింహులు
2. నాగర్ కర్నూల్ (ఎస్సీ)
సంపత్ కుమార్, మల్లు రవి, చారకొండ వెంకటేశ్
3. ఆదిలాబాద్ (ఎస్టీ)
నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్, రేఖా నాయక్
4.మహబూబాబాద్ (ఎస్టీ)
బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, విజయ బాయి
5.. ఖమ్మం (జనరల్)
రేణకాచౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, వీహెచ్, మల్లు నందిని / (సోనియా గాంధీ)
6. హైదరాబాద్ (జనరల్)
సమీర్ ఉల్లా ,సూరం దినేష్ ,ఆనంద్ రావు (ఎంబీటీ)
7. కరీంనగర్ (జనరల్)
ప్రవీణ్ రెడ్డి, రోహిత్ రావు , నేరెళ్ల శారద
8.. పెద్దపల్లి (ఎస్సీ ) –
గడ్డం వంశీ, వెంకటేశ్ నేత
9. నిజామాబాద్ (జనరల్) ఈరవత్రి అనిల్, జీవన్ రెడ్డి (ఎమ్మెల్సీ),సునీల్ రెడ్డి (ఆరెంజ్ ట్రావెల్స్ )
10. మెదక్ (జనరల్) జగ్గారెడ్డి, ,మైనంపల్లి హన్మంతరావు
11. జహీరాబాద్ (జనరల్)
సురేష్ షెట్కార్, త్రిష (మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె ), శ్రీకాంత్ రావు
12. మల్కాజిగిరి (జనరల్) బండ్ల గణేష్ ,హరివర్ధన్ రెడ్డి,సర్వే సత్యనారాయణ
13. సికింద్రాబాద్ (జనరల్)
అనిల్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, విద్యా స్రవంతి
14. చేవెళ్ల (జనరల్)
చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి, దామోదర్ అవేలీ
15. మహబూబ్ నగర్ (జనరల్) వంశీ చంద్ రెడ్డి ,
జీవన్ రెడ్డి (ఎంఎస్ఎన్ ఫార్మా), సీతాదయాకర్ రెడ్డి,
16. నల్గొండ (జనరల్)
జానారెడ్డి ,రఘువీర్ రెడ్డి (జానారెడ్డి కొడుకు), పటేల్ రమేష్ రెడ్డి
17. భువనగిరి (జనరల్)
చామల కిరణ్ కుమార్ రెడ్డి,పున్నా కైలాష్ నేత, పవన్ కుమార్ రెడ్డి
నల్గొండ, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ షార్ట్ లిస్ట్ రెడీ
మరోవైపు నల్గొండ, భువనగిరి ఎంపీ షార్ట్ లిస్ట్ రెడీ అయింది. నల్లగొండ (Nalgonda) నుంచి జానారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి పోటీ పడుతుండగా..భువనగిరి (Bhuvanagiri) రేసులో చామల కిరణ్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్యపవన్, పున్న కైలాష్ నేత, కుంభం కీర్తి రెడ్డిలు రేస్‌లో ఉన్నారు. నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని పటేల్ రమేష్‌రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చింది.
ఎమ్మెల్యే ఎన్నికల టైమ్‌లో సూర్యాపేట టికెట్ ఆశించిన పటేల్‌కు నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని లిఖిత పూర్వక హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇక ఎంపీ రేసులోకి వచ్చిన జానారెడ్డి ఫ్యామిలీ కూడా ఎంటర్ అయింది. భువనగిరి టికెట్ కోసం కోమటిరెడ్డి ఫ్యామిలీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడని...అందుకే అతనికి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని అంటున్నారు. ఇక నల్గొండ బరిలో రేవంత్ మరో అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డి కూడా రేస్‌లో ఉన్నారు.