Congress Six Guarantees : ప్రజాపాలన రెండో రోజు @8,12,862 దరఖాస్తులు

తెలంగాణలో ఆరు గ్యారెంటీల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజా పాలన కార్యక్రమంలో రెండో రోజు 8,12,862 దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,23,862.. పట్టణ ప్రాంతాల్లో నుంచి మొత్తం 4.89 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.

Praja Palana: ప్రజాపాలన దరఖాస్తులకు రేపే ఆఖరి రోజు.. కీలక అప్డేట్ ఇచ్చిన ప్రభుత్వం!
New Update

Congress Six Guarantees Applications: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రకటించిన ఆరు గ్యారెంటీల కోసం అప్లై చేసేందుకు ప్రజలు క్యూలు కడుతున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో మొదటి రోజు కంటే రెండో రోజే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8,12,862 దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,23,862 దరఖాస్తులు వచ్చాయని.. జిహెచ్ఎంసీ(GHMC), పట్టణ ప్రాంతాల్లో నుంచి మొత్తం 4.89 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. తొలి రోజున రాష్ట్రవ్యా ప్తంగా 7.46 7468 లక్షల దరఖాస్తులు వస్తే రెండో రోజున 8.12 లక్షలు వచ్చినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రెండు రోజుల్లో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో పల్లెల నుంచి 6.12 లక్షలు వస్తే, పట్టణాల నుంచి 9.46 లక్షలు వచ్చినట్లు తెలిపారు.

ALSO READ: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు.. నేడు ప్రకటన?

తొలి రోజున వచ్చిన దరఖాస్తులు..

* గ్రామాల నుంచి: 2,88,711

* పట్టణాల నుంచి: 4,57,703

* మొత్తం: 7,46,414

రెండో రోజు:

* గ్రామాల నుంచి: 3,23,862

* పట్టణాల నుంచి: 4,59,000

* మొత్తం: 8,12,862

రెండు రోజుల్లో వచ్చినవి :

* గ్రామాల నుంచి: 6,12,573

* పట్టణాల నుంచి: 9,46,703

* మొత్తం: 15,59,276

దరఖాస్తులు.. ప్రజల ఇక్కట్లు..

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పొందేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దరఖాస్తుల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. దరఖాస్తులు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 రోజుల సమయం ఇవ్వడంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల ముందు బారులు తీరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఫారాలు కూడా దొరకక ప్రజలు తన్నుకునే దాక వచ్చిందట.

ALSO READ: నేడు అయోధ్యకు ప్రధాని మోదీ

దరఖాస్తుకు వచ్చి గుండెపోటుతో మృతి..

మెదక్ జిల్లా కాగజ్ మద్దూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలనలో విషాదం చోటు చేసుకుంది. స్థానికుడు కుసంగి లక్ష్మయ్య (58) ప్రభుత్వ 5 గ్యారంటీలకు దరఖాస్తు సమర్పించడానికి వచ్చి కూలిపోయాడు వెంటనే స్పందించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

#prajapalana-abhayahastham-application #congress-six-guarantees #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe