Telangana Congress: తెలంగాణ పగ్గాలను చేజిక్కిచుకున్న కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా రేపు గాంధీ భవన్ లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయానులు కాంగ్రెస్ పార్టీ తీసుకోనుంది. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సోమవారం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
రేపు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ పదవుల కేటాయింపు, కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకం, అలాగే మరికొన్ని రోజుల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలి అనే దానిపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వారికి మొదటి ప్రయారిటీ కింద వారివారి అర్హత బట్టి ఏ పదవి కేటాయించాలనే దానిపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: మహిళల ఫ్రీ జర్నీకి ఆర్టీసీ కొత్త రూల్.. పాటించకపోతే రూ.500 ఫైన్!
హైదరాబాద్ లో కనిపించని కాంగ్రెస్.. ఎంపీ ఎన్నికలపై ఫోకస్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల ప్రభావం హైదరాబాద్ నగరంపై కనిపించలేదు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా గెలవలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ మంది బీఆర్ఎస్ వైపే మొగ్గుచూపారు. సెటిలర్లు ఓట్లు తమకు వస్తాయని ఆశించిన కాంగ్రెస్ పార్టీకి వారు షాక్ ఇచ్చారు. సెటిలర్లు హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారుకు సై అన్నారు. ఇదిలా ఉండగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో మూడు రంగుల జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తోంది. నాంపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన ఫిరోజ్ ఖాన్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిపై ఓడిపోయారు. అలాగే మాల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన మైనంపల్లి హనుమంతరావు కూడా ఓడిపోయారు. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే వీరు ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్లపై ఆశ పెట్టుకున్నారు. అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్నామని వారి కాంగ్రెస్ హికండ్ ను కోరినట్లు సమాచారం. తుంగతుర్తి నుంచి టికెట్ ఆశించి నిరాశ చెందిన అద్దంకి దయాకర్, కాల్వ సుజాత గుప్తా, బెల్లయ్య నాయక్, NSUI లీడర్ బల్మూరి వెంకట్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం లాంటి వారు కూడా ఈ లిస్టులో ఉన్నారు. అయితే, వీరికి కాంగ్రెస్ పార్టీ ఏయే పదవులు ఇస్తుదనేది వేచి చూడాలి.
ALSO READ: TS RTC: సీట్లన్నీ ఆడవాళ్లకేనా!.. బస్సుకు అడ్డం నిలుచున్న మగజాతి ఆణిముత్యం