Prajapalana: ఆరు గ్యారంటీల దరఖాస్తుకు గడువు పొడిగింపు?

కాంగ్రెస్ చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి రేపే చివరి తేదీ. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. చాలా మంది ఇప్పటికి దరఖాస్తులు చేసుకోలేదు. దరఖాస్తుకు గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా గడువు పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Prajapalana: ఆరు గ్యారంటీల దరఖాస్తుకు గడువు పొడిగింపు?
New Update

Six Guarantees Applications: ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీల అమలుపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి ప్రజాపాలన కార్యక్రమం (Praja Palana) కింద దరఖాస్తులను స్వీకరిస్తోంది. ప్రజా పాలన కార్యక్రమం కింద మహాలక్ష్మి, రైతు భరోసా (Rythu Barosa), గృహ జ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల పథకాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు ప్రజలు. గత నెల 28న ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం రేపటితో ముగియనుంది.

ALSO READ: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!

ప్రజల్లో ఆందోళన..

రేపటితో ఆరు గ్యారెంటీల (Six Guarantees) పథకాలు పొందేందుకు దరఖాస్తు ప్రక్రియ ముగియనుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికి చాలా మంది ఇంకా దరఖాస్తులు చేసుకోలేదు. ఈ పథకాలు పొందేందుకు కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలా?, కొత్తగా రైతు బంధు అప్లై చేయాలా? వద్ద?, కరెంట్ బిల్లు మగవారి పేరు మీద ఉండలా? లేదా ఇంట్లోని మహిళల పేరు మీద ఉండలా? అనే సందేహాలతో ప్రజలు దరఖాస్తులు చేయలేదు. మరికొన్ని చోట్లల్లో దరఖాస్తులు ఫామ్స్ లేకపోవడం ప్రజలు ఇబ్బందుకు పడ్డారు. రేపటితో దరఖాస్తులకు ఆఖరి తేదీ కావడంతో గడువు పెంచాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ALSO READ:  వైసీపీలోకి ఎన్టీఆర్ ఫ్రెండ్.. అక్కడి నుంచే ఎంపీగా స్టార్ డైరెక్టర్ పోటీ?

గడువు పొడిగిస్తారా?..

ప్రజాపాలన కార్యక్రమంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉంది. 6 గ్యారంటీల దరఖాస్తు గడువు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రేపటితో దరఖాస్తులకు గడువు ముగుస్తుంది. ప్రజా పాలన కార్యక్రమానికి డిసెంబర్‌ 31, జనవరి1 ప్రభుత్వం సెలవులు ఇవ్వడంతో ఈ గడువును మరో 2రోజులు పొడిగించే ఛాన్స్‌ ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. చివరి రోజు కావడంతో రేపు ప్రజాపాలన కార్యక్రమానికి భారీగా రద్దీ పెరిగే ఛాన్స్‌ ఉందని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు అప్లై చేయకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ప్రతీ 4 నెలలకోసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడుతామని సీఎస్ శాంతికుమారి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

#prajapalana-dates-extended #congress-six-guarantees #congress-praja-palana #cm-revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి