BIG BREAKING : నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వ నెల రోజుల పాలనపై ట్వీట్ చేశారు. 'సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటా' అంటూ ఆయన రాసుకొచ్చారు.

BIG BREAKING : నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
New Update

Telangana : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ నెల రోజలు పాలనకు సంబంధించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సంకెళ్లను తెంచి, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను పంచినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అంతేకాదు తాము సేవకులమే తప్పా.. పాలకులం కాదని చెప్పారు. అలాగే ఎప్పటికైనా తాను అన్నగానే ఉంటానని, పేదలు, యువత, ఆడబిడ్డల మొఖంలో ఆనందం చూడటమే తన లక్ష్యమన్నారు.

ఇది కూడా చదవండి : MOOSI : సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి అమ్రపాలి.. మూసీ ప్రక్షాళనపై ఫోకస్

అన్నగా నేనున్నాను..
ఈ మేరకు 'సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ.. పాలనను ప్రజలకు చేరువ చేస్తూ.. అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. పేదల గొంతుక వింటూ.. యువత భవితకు దారులు వేస్తూ.. మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ.. రైతుకు భరోసా ఇస్తూ.. సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోంది. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ.. పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ.. నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ.. మత్తులేని ఛైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది.రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా. మీ రేవంతన్న' అంటూ రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌ అవుతుండగా నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 'Telangana #tiger మా #రేవంత్ అన్న' అంటూ పొగిడేస్తున్నారు. రేవంతన్న నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు చెబుతూ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

#telangana #cm-revanth-reddy #tweet #on-month-long-rule
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe