Telangana: ఆ ప్రచారంపై కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్..

ఓ మహిళకు సాయం చేసిన అంశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లు దోచుకున్న లక్ష కోట్ల ఆస్తిలోంచి.. రూ. 1 లక్ష మాత్రమే సాయం చేశారని వ్యాఖ్యానించారు. దోచుకున్న సంపదనంతా కరిగిస్తామని అన్నారు.

Telangana: ఆ ప్రచారంపై కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్..
New Update

Telangana: ఓ మహిళకు సాయం విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు.. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజావాణిలో న్యాయం జరుగలేదని ఓ మహిళకు కేటీఆర్ లక్ష రూపాయలు అందించారని ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై స్పందించిన సీఎం రేవంత్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.10 ఏళ్లు అధికారంలో ఉండి దోచుకున్న లక్ష కోట్లలో లక్ష రూపాయలే కేటీఆర్ పంచారని వ్యాఖ్యానించారు. మిగతా డబ్బులను కూడా ఖచ్చితంగా ప్రజలకు పంచేలా చేస్తామని సీఎం అన్నారు. వారు ప్రజల రక్తం పిండి సంపాదించారని, ఆ ఆస్తులన్నింటినీ కరిగిస్తానని వ్యాఖ్యానించారు. ఉపయోగపడే భవనాలను కూల్చి కొత్తవి కట్టారని, అది ఆస్తి సృష్టించడం అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. 22 కొత్త ల్యాండ్ క్రూజర్ వాహనాలను కొని విజయవాడలో దాచిపెట్టారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌కు కూడా కౌంటర్ ఇచ్చారు. ఐటీఐఆర్ వెనక్కి వెళితే అడగని వినోద్ కుమార్.. సైనిక్ స్కూల్‌ గురించి అడగని ఆయన.. బుల్లెట్ ట్రైన్ గురించి తమకు నీతులు చెబుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగ నోటిఫికేషన్లపై కీలక ప్రకటన..

ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన జరుగుతోందన్నారు. ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఉండాలని, ప్రస్తుతం చైర్మన్ సహా బోర్డులోని సభ్యులంతా రాజీనామా చేశారని పేర్కొన్నారు. రాజీనామాలపై గవర్నర్ నిర్ణయం తీసుకున్న తరువాత.. వెంటనే నియామకాలకు సంబంధించి చర్యలు చేపడతామన్నారు. కొత్త బోర్డును ఏర్పాటు చేసి.. తప్పులు జరుగకుండా, పకడ్బందీగా నియమకాలు చేపడతామన్నారు. నియామకాల భర్తీ ఆలస్యం కాకుండా చూస్తామన్నారు సీఎం రేవంత్.

Also Read:

రాష్ట్రంలో పెరిగిన నేరాలు.. నివేదిక విడుదల చేసిన సీపీ సుధీర్ బాబు

ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫామ్.. డౌన్లోడ్ చేసుకోండి!

#telangana-cm #cm-revanth-reddy #ktr #brs #congress
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe