CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో (PM Modi) రేవంత్ సమావేశం అవుతారని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు అపాయింట్మెంట్ కూడా ఖరారైనట్లు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీ తర్వాత హైకమాండ్ పెద్దలతో రేవంత్ సమావేశం కానున్నారు. అయితే.. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఇది కూడా చదవండి: Sun Burn: బుక్ మై షోపై కేసు నమోదు.. సన్‌బర్న్ ఈవెంట్‌పై రేవంత్ ఆగ్రహం!
వీరిద్దరూ రేపు మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. ప్రధానితో సమావేశం తర్వాత వీరు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకతో వీరు భేటీ అవనున్నారు. నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ అభ్యర్థుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి నాయకులతో పాటు కేడర్ లో జోష్ నింపాలని టీపీసీసీ భావిస్తోంది. రేపు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి రేపటి ఖమ్మం పర్యటన కూడా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.