TG-AP : రేపు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఈ అంశాలపైనే చర్చలు

తెలుగు రాష్ట్రాల సీఎంలు రేపు ప్రజాభవన్‌లో సమావేశం కానున్న సంగతి తెలిసిందే. విభజన సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాలు పలు అంశాల అజెండాను సిద్ధం చేశాయి. మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

TG-AP : రేపు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఈ అంశాలపైనే చర్చలు
New Update

Chandrababu - Revanth Meet Tomorrow : తెలుగు రాష్ట్రాల సీఎంలు రేపు ప్రజాభవన్‌ (Praja Bhavan) లో సమావేశం కానున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సమస్యలకు సంబంధించి ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఏపీ నుంచి మంత్రులు అనగాని, బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy), కందుల దుర్గేష్ (Kandula Durgesh) హాజరుకానున్నారు. అలాగే సీఎస్‌, ఆర్థిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శులు రానున్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాలు పలు అంశాల అజెండాను సిద్ధం చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఏపీ పునర్వవ్యస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, 10 సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చ
2. షీలా బీడే కమిటీ సిఫార్సులపై సమీక్ష
3. తెలంగాణ నుంచి ఏపీకి రావలసిన విద్యుత్ బకాయిలు రూ. 7,200 వేల కోట్లు, ఏపీఎఫ్‌సీ అంశాలపై చర్చ
4. ఏపీ-తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై సమీక్ష.
5.ఉద్యోగుల పరస్పర బదిలీలు
6. లేబర్ సెస్ పంపకాలు
7. ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై చర్చ.
8. హైదరాబాదులోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చ
9.ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున ఉన్న నగదుపై చర్చ

Also read: తీహార్ జైలులో కవితతో కేటీఆర్, హరీష్ ములాఖాత్

అయితే గత పదేళ్లుగా బ్యాంకు విభజన పూర్తి కానీ సంస్థల బ్యాంకు ఖాతాల్లో రూ 8,000 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఉన్న విషయం తెలిసిందే. ఇక 9వ షెడ్యూల్‌లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఏపి జెన్కో (APGENCO) విలువ రూ.2,448 కోట్లుగా నిర్ధారణ అయ్యింది. ఇక 10వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల్లో రూ.2,994 కోట్ల నిధులు ఉండగా.. వీటికి సంబంధించి ఇప్పటికే రెండు రాష్ట్రాలు రూ.1,559 కోట్లను పంచుకున్నాయి. మిగిలిన రూ.1,435 కోట్ల రూపాయల విషయంలో ఇంకా పంచాయితీ తేలలేదు. ఇలా వీటన్నింటిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Also read: పెందుర్తిలో గంజాయి ముఠా అరెస్ట్.. 20 కేజీలు స్వాధీనం!

#cm-revanth #telugu-news #ap-cm-chandrababu #praja-bhavan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe