Telangana Cabinet : రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన మత్రివర్గం సమావేశం కానుంది. ఈసీ (EC) ఆదేశాల మేరకు ఈ కేబినేట్ మీటింగ్ లో అత్వవసర అంశాలు మాత్రమే చర్చించనున్నారు.
ఈ మేరకు తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ (Election Commission) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా అత్యవసర విషయాలపైనే చర్చించాలని షరతులు పెట్టింది. ఎన్నికల విధుల్లో ఉన్న వారు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని, రైతు రుణమాఫీ (Rythu Runa Mafi), ఉమ్మడి రాజధాని విషయాలను చర్చించవద్దని స్పష్టం చేసింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ అంశంపై చర్చించడమే ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీ నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావించింది. మంత్రివర్గ సమావేశంలో రుణామాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మత్రివర్గం సమావేశం కానుంది.
Also Read : బెంగళూరులో రేవ్ పార్టీ.. భారీగా డ్రగ్స్.. నటి హేమ కూడా..?