Telangana Ministers List : తెలంగాణ (Telangana) లో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 4న మంత్రివర్గణ విస్తరణ ఉండే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉన్నాయి. ఇందులో కేవలం 4 మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని గాంధీ భవన్ (Gandhi Bhavan) వర్గాలు చెబుతున్నాయి. మరో 2 ఖాళీలను ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ పేర్లు ఇప్పటికే ఫైనల్ అయ్యాయన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కేబినెట్ లో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో మంచిర్యాల నుంచి గెలిచిన ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మంత్రి వర్గంలో చోటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఢిల్లీ (Delhi) కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ తో చర్చించి మంత్రివర్గ విస్తరణ ఫైనల్ లిస్ట్ తో వీరు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.
అయితే.. మంత్రి వర్గంలో చోటు దక్కని కీలక నేతలకు ఇతర పదవులను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణతో పాటే పీసీసీ చీఫ్, చీఫ్ విప్, ఉపసభాపతి ఎంపిక పూర్తి చేయనున్నారు. మధుయాష్కీ గౌడ్, మహేశ్‌కుమార్ గౌడ్‌లో ఒకరికి పీసీసీ చీఫ్ పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. ఇంకా దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్లను చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నారు.
Also Read : పవన్ ఆదేశాలతో కదిలిన ఖాకీలు.. జమ్మూలో దొరికిన మిస్సింగ్ యువతి!