Telangana BJP: ఆ 15 మంది నేతలకు తెలంగాణ బీజేపీ షాక్.. పదవులు ఔట్!

గత ఎన్నికల్లో సరిగా పని చేయకపోవడంతో పాటు పార్టీకి నష్టం చేసిన 15 మంది జిల్లా అధ్యక్షులను మార్చడానికి తెలంగాణ బీజేపీ సిద్ధం అవుతోంది. దీంతో పాటు రాష్ట్ర పదాధికారుల్లోనూ మార్పులు, చేర్పులు చేయనుంది. మరో వారం పది రోజుల్లో బీజేపీలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

New Update
Telangana BJP: ఆ 15 మంది నేతలకు తెలంగాణ బీజేపీ షాక్.. పదవులు ఔట్!

Telangana BJP:  అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీజేపీ (BJP) పార్టీ కమిటీల ప్రక్షాళనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొత్తం 15 మంది జిల్లా అధ్యక్షులను తొలగించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆరోపణలు వచ్చిన, సరిగా పని చేయని పార్టీ జిల్లా అధ్యక్షుల పై వేటు వేయనుంది నాయకత్వం. ఇందులో భాగంగా 15 జిల్లాలకు కొత్త అధ్యక్షులు (15 District Presidents) రానున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Deputy CM Bhatti vikramarka: భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి

సుదీర్ఘ కాలంగా అధ్యక్షులుగా కొనసాగుతున్న వారిని పక్కకు పెట్టడంతో పాటు రాష్ట్ర పదాధికారుల్లోనూ మార్పులు చేర్పులు చేయనుంది బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టీమ్ ను తయారు చేస్తున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో అప్పగించిన పనులు సక్రమంగా చేయని నేతలను... పట్టించుకోని నేతలకు పార్టీ పదవుల నుండి తప్పించాలని పార్టీ భావిస్తోంది.

ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శులతో కిషన్ రెడ్డి సమావేశమై చర్చలు కూడా జరిపారు. ఇంకా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి పై వచ్చిన పిర్యాదులు పై బీజేపీ క్రమ శిక్షణ కమిటీ చర్చించి నోటీసులు ఇవ్వనుంది.

Advertisment
తాజా కథనాలు