Telangana BJP: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి ఎంపీ, మాజీ ఎమ్మెల్యే?

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించానికి సిద్ధమవుతున్న బీజేపీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ బాపురావు, వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతల రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సాయంత్రం జరగాల్సిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని వాయిదా వేశారు.

New Update
Telangana BJP: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి ఎంపీ, మాజీ ఎమ్మెల్యే?

తెలంగాణ బీజీపీకి (Telangana BJP) భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేత రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలు పార్టీని వీడితే అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని నాయకత్వంలో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సాయంత్రం జరగాల్సిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడింది. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు టచ్ లో ఎంత మంది ఉన్నారన్న అంశంపై పార్టీ ముఖ్యనాయకులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Telangana Politics: తెలంగాణ ప్రజల చెవుల్లో కేసీఆర్ గులాబీ పూలు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఇదిలా ఉంటే.. పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ ఈ సారి తాను పోటీ చేయనని నాయకత్వానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన ముషీరాబాద్ నుంచి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: BRS Manifesto: రెచ్చిపోయిన డీకే అరుణ.. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై షాకింగ్ కామెంట్స్

ఈటల రాజేందర్ గజ్వేల్, హుజూరాబాద్ రెండు స్థానాల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రాకటించారు. ఆయన ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు కూడా. మరో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సారి మునుగోడు నుంచి కాకుండా ఎల్బీ నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కిషన్ రెడ్డి మరోసారి అంబర్ పేట నుంచే పోటీ చేస్తానని కార్యకర్తలకు స్పష్టత ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు