Telangana BJP: ఈ నెల 6న బీజేపీ అభ్యర్థుల జాబితా.. ఆ స్థానాలకు అభ్యర్థులు ఖరారు?

అభ్యర్థుల జాబితాపై కసరత్తు మొదలెట్టిన బీజేపీ అధిష్టానం. ఈనెల 6న బీజేపీ అభ్యర్థుల జాబితా ఉన్నట్లు సమాచారం. అభ్యర్థుల ప్రకటనపై ఢిల్లీలో అమిత్‌షాతో కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. అమిత్‌షాతో అభ్యర్థుల ఎంపిక అంశం, పార్టీలో నెలకొన్న పరిస్థితిలు, మోదీ సభపై కిషన్‌రెడ్డి చర్చించారు. కొన్ని నియోజకవర్గాలకు పేర్లని బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు ఖరారు చేసినట్టు సమాచారం.

BJP: చేవెళ్ల ఎంపీ టికెట్ కోసం బీజేపీలో లొల్లి..
New Update

తెలంగాణ బీజేపీ (Telangana BJP) అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఖరారైంది. అభ్యర్థుల జాబితాపై బీజేపీ అధిష్టానం కసరత్తు తీవ్రం చేసింది. ఆ జాబితాకు హైకమాండ్ తుది రూపు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఢిల్లీలో అమిత్ షాతో ఈ రోజు కీలక భేటీ అయ్యారు. ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను కిషన్‌రెడ్డి అమిత్‌షాకు చూపించారు. నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో.. కేంద్ర ఎన్నికల కమిటీ బేటీలో తెలంగాణ అభ్యర్థులపై చర్చ జరిగే అవకాశం ఉంది. జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఈనెల 6న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

బలమైన నేతల పేర్లపై చర్చ

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సహం ఉన్న వారి నుంచి పార్టీ నాయకత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే మొత్తం 6,003 అప్లికేషన్లు వచ్చాయి. 40 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒకే అభ్యర్థి పోటీలో ఉన్న ముఖ్య నేతల స్థానాలకు బీజేపీ మొదటి జాబితాను ఖరారు చేసింది. అయితే మిగతా చోట్ల అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, విజయావకాశాలు, ఇతర పార్టీల నుంచి వచ్చే అవకాశాలున్న బలమైన నేతల పేర్లు తదితర అంశాలపై ముఖ్య నేతలు చర్చిస్తున్నారు.

అగ్ర నాయకత్వ పరిశీలనకు ..

కాగా.. నిన్న (ఆదివారం) దిల్‌ కుష గెస్ట్‌ హౌస్‌లో కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ఇతర సీనియర్‌ నేతలు ఈ భేటీలో పాల్గొ­న్నారు. చాలాచోట్ల నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున అభ్యర్థుల పేర్లను సూచిస్తూ ఇచ్చిన జాబితాలపై పార్టీ ముఖ్య నేతలు చర్చించినట్లు సమాచారం. ఇక సంఘ్‌ పరివార్‌ నుంచి అభ్యర్థుల ప్రతిపాదనలతో మరో జాబితా తీసుకున్నారు. ఈ జాబితాలను సరిచూసి కామన్‌గా వచ్చిన పేర్లతో ముసాయిదా జాబితాను సిద్ధంచేసి అగ్ర నాయకత్వ పరిశీలనకు పంపించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపారు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై రెండుమూడు రోజుల్లో మరోసారి ఈ ముఖ్యనేతలు సమావేశమయ్యే అవకాశం ఉంది. కాగా, జేపీ నడ్డా అధ్వర్యంలో వచ్చే శుక్రవారం బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ సమావేశం కొనసాగనున్నది. సమావేశానికి రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌ఛార్జీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అసెంబ్లీ పార్లమెంట్ ఇన్‌చార్జీలు, కన్వీనర్లకు ఆహ్వానం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమాయత్తంపై చర్చించిన తర్వాత అదే రోజు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.

#telangana-politics #telangana-bjp #g-kishan-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe