TS Assembly: విద్యుత్ రంగం అప్పు రూ.81,516 కోట్లు.. భట్టి సంచలన రిపోర్ట్!

ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. నిన్న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు నడిచాయి.

New Update
TS Assembly: విద్యుత్ రంగం అప్పు రూ.81,516 కోట్లు.. భట్టి సంచలన రిపోర్ట్!

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజు కొనసాగనున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది రాష్ట్ర సర్కార్. దీనిని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశ పెట్టనున్నారు. కరెంట్ పై వాడివేడిగా అసెంబ్లీ చర్చలు జరిగే అవకాశం ఉంది. నిన్న (బుధవారం) రాష్ట్ర ఆర్థిక స్థితుగతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సవాళ్లు, ప్రతిసవాళ్లు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య నడిచాయి. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంవాదం పెట్టుకున్నారు. ఈ రోజు విద్యుత్ రంగంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చర్చకు సిద్ధమయ్యారు.

విద్యుత్ రంగం అప్పు రూ.81,516 కోట్లు: భట్టి

ఆర్థిక పురోగతికి విద్యుత్ రంగం కీలకం అని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో విద్యుత్ రంగం పరిస్థితి చూస్తే ఆందోళన కలిగిస్తుందని అన్నారు. విద్యుత్ రంగం అప్పు రూ.81,516 కోట్లు ఉందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 29 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. డిస్కమ్ లు అప్పుల్లో కూరుకుపోయాయని అన్నారు. విద్యుత్ సంస్థలను గత ప్రభుత్వ గాలికి వదిలిందని మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖకు విద్యుత్ రంగం రూ.14,190 కోట్ల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు.

ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్!

Advertisment
Advertisment
తాజా కథనాలు