CM KCR: సీఎం కేసీఆర్ కు షాక్.. ఆయనపై పోటీకి 1016 మంది.. కారణమిదే?

తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో అక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. ప్రత్యర్థిపార్టీల నుంచి పోటీ సంగతి పక్కనపెడితే...అధికారపార్టీని ఇరకాటంలో పెట్టేందుకు గ్రౌండ్ వర్క్ చకచకా జరుగుతోంది. సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు కాయితీ లంబాడాలు రెడీ అవుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వెయ్యికిపైగా లంబాడాలు కేసీఆర్ ను ఢీకొడతామంటున్నారు. దీంతో అధికారపార్టీలో కొత్త టెన్షన్ షురూ అయ్యింది.

CM KCR: సీఎం కేసీఆర్ కు షాక్.. ఆయనపై పోటీకి 1016 మంది.. కారణమిదే?
New Update

తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో అక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. ప్రత్యర్థిపార్టీల నుంచి పోటీ సంగతి పక్కనపెడితే...అధికారపార్టీని ఇరకాటంలో పెట్టేందుకు గ్రౌండ్ వర్క్ చకచకా జరుగుతోంది. సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు కాయితీ లంబాడాలు రెడీ అవుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వెయ్యికిపైగా లంబాడాలు కేసీఆర్ ను ఢీకొడతామంటున్నారు. దీంతో అధికారపార్టీలో కొత్త టెన్షన్ షురూ అయ్యింది.

తెలంగాణలో మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఎవరి రచనల్లో వారున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఈ దఫా కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో అక్కడ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ కొత్త తలనొప్పి వచ్చిపడింది. అదేంటంటే సీఎం కేసీఆర్ పై వెయ్యికిపైగా కాయితీ లంబాడాలు పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. 1,016 లంబాడాలను పోటీలోకి దింపుతున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ తెలిపారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను మండలాలవారిగా ఆయన ప్రకటించారు. ప్రస్తతం ఓసీ జాబితాలో ఉన్న కాయితీ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కేసీఆఱ్ ఇఛ్చిన గడువు ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సీఎం తన నిర్ణయాన్ని ఇప్పటికైనా వెల్లడించనట్లయితే..మూడు, నాలుగు రోజుల్లో సచివాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: నేటితో ముగుస్తున్న చంద్రబాబు రిమాండ్..నెక్ట్స్ ఏం జరగబోతోంది..!!

ఇక కాయితీ లంబాడీలను ఎస్టీజాబితాలో చేర్చాలంటూ గతకొన్నాళ్లుగా పోరాటు చేస్తున్నారు. పోడు పట్టాలతోపాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని వాడు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గతకొన్నాళ్లుగా నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఏక్తా ర్యాలీ కూడా చేపట్టారు. దశాబ్దాలుగా తమకు తీరని అన్యాయం జరుగుతుందని తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని పోడు పట్టాలు ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ అంటున్నారు.

ఇది కూడా చదవండి: ఈ ఐదు పండ్లు తింటే రోగాలు పరార్.. అవేంటంటే?

కాగా ఈ సారి కేసీఆర్ తన సిట్టింగ్ నియోజకవర్గమైన గజ్వేల్ తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ పై పోటీ చేసి తమ సత్తా ఏంటో నిరూపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ జిల్లాలో లంబాడీలు ఎక్కువగా ఉంటారు. దాదాపు 22వేల మంది ఓటర్లు వీరే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. వారు కేసీఆర్ పై పోటీ చేస్తే బీఆర్ఎస్ కు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది.

#telangana #cm-kcr #kamareddy #assembly-elections #gajwel #kamareddy-assembly-segment #kaithi-lambadas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe