Telangana : రెండు తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) శనివారం సమావేశం కానున్నారు. హైదరాబాద్ (Hyderabad) లోని ప్రజాభవన్ (Praja Bhavan) వేదికగా సాయంత్రం 6 గంటలకు సీఎంల భేటీ ప్రారంభం కానుంది. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు, ఉమ్మడి ఆస్తులు, పంపకాలపైనే ప్రధాన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు చంద్రబాబు ముందు రేవంత్ 6 డిమాండ్లు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం జనాభా నిష్పత్తి ప్రకారమే ఆస్తుల పంపకం జరగాలని సూచిస్తున్నట్లు సమాచారం. అయితే 100కి.మీల కోస్టల్ కారిడర్‌లో తీరప్రాంతం వాటా కావాలంటూ రేవంత్ పెట్టిన డిమాండ్ కు చంద్రబాబు అంగీకరిస్తే.. తెలంగాణ రూపు రేఖలు మారనున్నాయి. కోస్టల్ కారిడర్‌లో తీరప్రాంతం వాటా తెలంగాణ మ్యాప్ 100 కిలోమీటర్లు విస్తరించనుంది.
రేవంత్ డిమాండ్లు:
- తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగం కావాలి.
- ఏపీలో కలిపిన 7 మండలాలు వెనక్కి ఇవ్వాలి.
- విద్యుత్ బకాయిలు రూ.24వేల కోట్లు చెల్లించాలి.
- కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం ఇవ్వాలి.
- 100కి.మీల కోస్టల్ కారిడర్‌లో తీరప్రాంతం వాటా కావాలి.
- కృష్ణాజలాల్లో 558 TMCలు కేటాయించాలి.
చంద్రబాబు డిమాండ్లు
- హైదరాబాద్‌లోని 3 భవనాలు ఏపీకి కేటాయించాలి.
- విద్యుత్ బకాయిలు రూ.7,200 కోట్లు చెల్లించాలి.
- జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తుల పంపకం ఉండాలి.
- విభజన చట్టంలో పెట్టని ఆస్తుల్నీ పంచాలి.
- వెంటనే ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి.
విభజన సమస్యలు
షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల పంపకాలు. 15 సంస్థల మధ్య రుణ పంపకాలు. ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులు. ఉద్యోగుల పరస్పర బదిలీలు. లేబర్ సెస్ పంపకాలు.పెడ్యుల్-10లో 142 సంస్థలు- 38వేల కోట్ల ఆస్తుల పంపకం. చట్టంలో పేర్కొనని రూ. 1759 కోట్ల విలువైన 12 సంస్థలు. విభజన పూర్తికాని సంస్థల బ్యాంకు ఖాతాల్లోని రూ 8వేల కోట్ల వినియోగం.10వ షెడ్యూల్ సంస్థల్లోని రూ.1,435 కోట్ల వినియోగంతోపాటు తదితర అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి.
Also Read : తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా?