Telangana: ఒక్క క్లిక్‌తో అభయహస్తం అప్లికేషన్ ఫామ్.. మీ మొబైల్‌లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!

తెలంగాణ ఆరు గ్యారెంటీల పథకం అప్లికేషన్ ఫామ్ దొకరడం లేదా? మరేం పర్వాలేదు. మీకోసం ఆర్టీవీ అందిస్తోంది అభయ హస్తం అప్లికేష్ ఫామ్. ఒక్క క్లిక్‌తో మీ ఫోన్‌లోనే అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

New Update
అభయహస్తం అప్లికేషన్లపై కాంగ్రెస్ కీలక ప్రకటన.. అలా మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి!

Congress 6 Guarantee Schemes Application Form: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల అమలులో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 'ప్రజా పాలన' కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రులు, ఎమ్మెల్యేలు. దీంతో ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల వద్ద బారులుతీరారు. అంతకంటే ముఖ్యంగా అభయ హస్తం గ్యారెంటీల దరఖాస్తుల కోసం ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దరఖాస్తుల ఫారంల పేరుతో ప్రజల నుంచి దోపిడీకి పాల్పడుతున్నారు కొందరు దళారులు. ఒక్కో దరఖాస్తు ఫారం కోసం 20 నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దీనిపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, ఈ దోపిడీపై ప్రభుత్వ అధికారులు స్పందించారు. అభయ హస్తం 6 గ్యారెంటీ పథకాల దరఖాస్తు ఫారంలు ఎవరి వద్ద కొనాల్సిన పని లేదని, ఉచితంగానే అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. ఇవి ఉచితంగా ఇచ్చే ఫామ్స్ అని.. వీటి కోసం ఒక్క రూపాయ కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాలు, వార్డుల్లో ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు అధికారులు. అదేవిధంగా ప్రజాపాలన గ్రామ సభల్లోనూ, ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఈ ఫారం ఉచితంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఫోన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అభయ హస్తం 6 గ్యారెంటీ పథకాల దరఖాస్తు ఫారంను ఆన్‌లైన్‌లోనూ విడుదల చేసింది. ఈ దరఖాస్తు ఫారం పీడీఎఫ్‌ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. అప్లికేషన్ ఫామ్ కోసం ఎక్కడికి పోనవసరం లేకుండా.. మీ మొబైల్‌ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానిని జీరాక్స్ తీసుకోవచ్చు. అభయ హస్తం 6 గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్‌ను ఆర్టీవీ మీకోసం అందిస్తుంది. అప్లికేషన్ ఫామ్ కోసం కింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి.. నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

DOWNLOAD APPLICATION FORM HERE

అభయ హస్తం 6 గ్యారెంటీల పథకాల దరఖాస్తు ఫారం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.

Also Read:

పట్టణంలో ఉండి కూడా ప్రభుత్వ పథకాలకు అప్లే చేసుకోవచ్చు..!

తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే.. అమిత్ షా ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Advertisment
Advertisment
తాజా కథనాలు