Telangana: తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే.. అమిత్ షా ఇంట్రస్టింగ్ కామెంట్స్..

తెలంగాణలో భవిష్యత్‌ బీజేపీదే అన్నారు అమిత్ షా. బీఆర్ఎస్ మునిగింది.. కాంగ్రెస్ మునగబోతోందని.. ఇక రాష్ట్రంలో బీజేపీదే హవా అని అన్నారు. తెలంగాణలో 10 పార్లమెంట్ సీట్లు పక్కా గెలవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కేంద్రహోంమంత్రి అమిత్ షా.

New Update
Telangana: తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే.. అమిత్ షా ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Amit Shah Meeting with Telangana BJP Leaders: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే అని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మునిగింది.. కాంగ్రెస్ మునిగిపోయేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి పని చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. గురువారం తెలంగాణకు వచ్చిన అమిత్ షా.. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, తరుణ్ చుగ్‌తో చాలాసేపు సమావేశం అయ్యారు. కొంగరకలాన్‌లో బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణలో 35శాతం ఓట్ల శాతంలో 10 పార్లమెంటు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8 సీట్ల వరకు వచ్చామని.. ఇది వచ్చే ఎన్నికల్లో 64కావచ్చు.. 95 కూడా కావచ్చని వ్యాఖ్యానించారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలు ఒక్క కుటుంబ పాలన నుంచి విముక్తి పొంది మరో కుటుంబం చేతిలో పడ్డారని అన్నారు. స్కామ్‌లు అన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్నారు. తెలంగాణలో బీజేపీ ఇచ్చిన హామీలు.. మాదిగ రిజర్వేషన్‌తో సహా అన్నింటికీ కట్టుబడి ఉన్నామని తెలిపారు అమిత్ షా. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పని చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లో 10 సీట్లు గెలవాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా.

Also Read:

మేడం కాదు.. సీతక్క అని పిలవండి.. అధికారులకు మంత్రి సూచన..

సీఎం జగన్‌తో అంబటి రాయుడు భేటీ.. ఆ సీటు కన్ఫామ్ అయినట్లేనా?!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు