Prof. Kodandaram: అలా చేసినందుకే బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయింది: ప్రొ. కోదండరాం తెలంగాణలో నియంతృత్వ పోకడ వల్లే అధికారం కోల్పోయామని బీఆర్‌ఎస్ నేతలు గుర్తించలకపోతున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో భయాలు, ఆంక్షలు చూశామని.. ఇప్పుడు తల మీద భారం తగ్గినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. By B Aravind 12 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో భయాలు, ఆంక్షలు చూశామని.. ఇప్పుడు చూస్తే తల మీద భారం తగ్గినట్లు అనిపిస్తోందని అన్నారు. నెలరోజుల కాంగ్రెస్ పాలన బాగుందని వ్యాఖ్యానించారు. 'ప్రతినెల నాలుగో తేదీలోగా ఉద్యోగులకు జీతాలు రావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ ప్రజలతో కలసిపోయి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కూడా మార్పులు రావాలని కోరుతున్నాం. Also read: 14వేల కోట్లకు మేఘా విడాకులు..పీపీరెడ్డిని బయటకు పంపేసిన కృష్ణారెడ్డి ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరాం. గత ప్రభుత్వం నిరసనలు చేసిన వారిపై కేసులు పెట్టింది. రాజకీయ ఉద్దేశంతో పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలి. ఎట్టకేలకు తెలంగాణలో కొనసాగిన నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించాం. నియంత పోకడల వల్లే అధికారం కోల్పోయామని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. ప్రధాని మోదీ కూడా తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ బయ్యారం ఉక్కు పరిశ్రమ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేశారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం ఆలస్యం చేస్తోంది. మరోవైపు భద్రచలంలో రామాలయానికి ఎలాంటి భద్రత లేదు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తోన్న వివక్షను ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించాలని మేము నిర్ణయం తీసుకున్నామని' ప్రొ. కోదండరాం అన్నారు. Also read: రేషన్ కార్డ్ ఉందా?అయితే మీకో గుడ్ న్యూస్..అందులో ఉచితంగానే..!! #telugu-news #telangana-news #professor-kodandaram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి