Collectors Report : వరద ప్రభావిత ప్రాంతాలపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఫోకస్ పెట్టింది. వరద (Flood) నష్టాన్ని అంచనా వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్లు వరద ప్రభావిత ప్రాంతల్లో సర్వే చేయించారు. సర్వే నివేదికను ప్రభుత్వానికి అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 7 వేలకు పైగా ఇండ్లు కూలిపోయినాట్లు అధికారులు చెప్పారు.
అందులో కొన్ని పూర్తిగా కూలిపోగా.. కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయని చెప్పారు. దెబ్బతిన్న 7 వేల ఇండ్లలో ఎక్కువ శాతం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాతి స్థానంలో మహబుబాబాద్ జిల్లా ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా కలెక్టర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం హౌసింగ్ ఆఫీసర్లు గ్రామాల వారీగా వర్షాలు , వరదల కారణంగా ఇండ్లు కూలిపోయిన వారి వివరాలు సేకరిస్తున్నారు.
బాధితులకే మొదటి ప్రాధాన్యత..
వరదల వల్ల ఇల్లు కూలిపోయి నివాసం కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండేందుకు సిద్ధమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత ఇళ్ల పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme) లో మొదటి ప్రాధాన్యత ఈ వరదల్లో ఇల్లు కోల్పోయిన వాళ్ళకే ఉంటుంది అని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఇళ్లు కొల్పోయిన వారి వివరాలను జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి అందించనున్నారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బాధితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఇంకా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read : మానవ ముఖంతో వినాయకుడి విగ్రహం ఉన్నఏకైక ఆలయం.. వివరాలివే!