TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

New Update
TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటించారు రోడ్డు రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్. జూన్ 1, 2024 నుంచి పెంచిన పీఆర్సీ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. 2017 లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 17 శాతం పీఆర్సీ పెంచింది. తాజాగా రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలగనుంది. పీఆర్సీ ప్రకటించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై ఏటా రూ. 418.11 కోట్లు అదనపు భారం పడనుంది. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ALSO READ: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. రాజ్యసభకు కమల్ హాసన్?

అవి తప్పుడు ప్రచారాలు..

పీఆర్సీ ప్రకటన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల ప్రయాణ సాధనం ఆర్టీసీ అని మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సు ప్రయాణంలో పేదలకు వీలుగా ఉండేదుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే.. ఇటీవల సోషల్ మీడియాలో పల్లె వెలుగు బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ టికెట్  కొడుతున్నారని.. ఆర్డినరీ బస్సులను ఎక్స్‌ప్రెస్ బస్సు పేర్లు రాసి టీఎస్‌ఆర్టీసీ నడుపుతుందని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. జరుగుతున్న ప్రచారం ఫేక్ అని.. ఆ ప్రచారాన్ని ఖండించారు. జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు పని లేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఆటో కార్మికులను ఆదుకుంటాం..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఆటో కార్మికులకు కొంత మేరకు నష్టం జరిగిందని అన్నారు మంత్రి పొన్నం. వారిని తమ ప్రభుత్వం తప్పకుండ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆటో డైవర్లు ఎలాంటి అధైర్యపడొద్దని.. ఎన్నికల సమాయంతో ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం ఇస్తామన్న మాటకు  తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా మాజీ మంత్రులు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆటో కార్మికులకు గతంలో ఉన్న మాజీ మంత్రులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. మమ్మల్ని మాత్రం ఆటో కార్మికులకు రూ.15000 ఇవ్వాలని కోరుతున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని.. పేదల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు