New Jobs In Telanagana: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM), తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక శాఖ, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ క్రింద ఒక రిజిస్టర్డ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ. ఇది తెలంగాణ నుంచి అర్హత కలిగిన స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులకు విదేశీ ప్లేస్‌మెంట్‌ను సులభతరం చేస్తుంది. TOMCOM గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా , జర్మనీ, హంగేరి, జపాన్, పోలాండ్ , రొమేనియా, యూకే లాంటి వివిధ దేశాలలో వివిధ ప్రభుత్, ప్రైవేట్ నమోదిత ఏజెన్సీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది . అభివృద్ధి చెందిన దేశాలలో నర్సులు , ఇతర నైపుణ్యం కలిగిన కార్మికులకు అధిక డిమాండ్ ఉందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే నర్సింగ్ విద్యార్థులకు TOMCOM గుడ్ న్యూస్ చెప్పింది.
నెలకు లక్షా 80 వేల సంపాదించవచ్చు:
TOMCOM నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం జపాన్‌లో హాస్పిటాలిటీ ఉద్యోగాల్లో ఉద్యోగావకాశాలను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు సంపాదించవచ్చు. తెలంగాణ ప్రభుత్వ రిజిస్టర్డ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ అయిన TOMCOM, హాస్పిటాలిటీ పరిశ్రమలో రిక్రూట్‌మెంట్ కోసం స్క్రీనింగ్ టెస్ట్ జనవరి 29, సోమవారం, విద్యానగర్, శివమ్ రోడ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ట్రైనింగ్ (NSTI)లో నిర్వహించనుంది.
22 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల పని అనుభవం ఉన్న లేదా లేని గ్రాడ్యుయేట్లు, నర్సింగ్‌లో BSc లేదా జనరల్ నర్సింగ్చ మిడ్‌వైఫరీ (GNM) కలిగి ఉన్నవారు కూడా ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన అభ్యర్థులు జపాన్‌లో పనిచేయడానికి అవసరమైన జపనీస్ భాష, ఇతర వృత్తి నైపుణ్యాలపై శిక్షణ పొందుతారని TOMCOM తెలిపింది.
Also Read: ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం.. వీసీల నియామకానికి నోటిఫికేషన్